Vaikuntha Ekadashi: శ్రీరామనగరంలో ముక్కోటి ఏకాదశి శోభ.. స్వామి వారి దర్శనానికి పొటెత్తిన భక్తులు..
హైదరాబాద్ నగరం శివారు ముచ్చింతల్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరామనగరం ముక్కోటి ఏకాదశి శోభతో వెలిగిపోతోంది. దివ్యసాకేతం నుంచి దివ్యదేశాల వరకూ పెరుమాళ్ల ఊరేగింపు వైభవంగా సాగింది.
హైదరాబాద్ నగరం శివారు ముచ్చింతల్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరామనగరం ముక్కోటి ఏకాదశి శోభతో వెలిగిపోతోంది. దివ్యసాకేతం నుంచి దివ్యదేశాల వరకూ పెరుమాళ్ల ఊరేగింపు వైభవంగా సాగింది. ఊరేగింపు తర్వాత పెరుమాళ్లు, ఆండాల్ అమ్మవారితోపాటు నమ్మాళ్వార్, రామానుజాచార్య ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విశేష పూజలు చేశారు. 108 దివ్యదేశాలు ఉన్న ప్రాంతంలోనే ఈ పూజాదికాలు జరిగాయి. శ్రీరామనగరంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం ఉదయం తెల్లవారు జాము నుంచే భక్తులు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు.
ఈ వైకుంఠ ఏకాదశి పూజల్లో చినజీయర్ స్వామితోపాటు మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిరోజు ఉత్తర ద్వారదర్శనాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ముచ్చింతల్ క్షేత్రంలో 108 వైష్ణవ దివ్యదేశాలు కొలువై ఉండడంతో ఆ మూర్తుల దర్శనం కోసం భక్తులు విశేష సంఖ్యలో వస్తున్నారు.
స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని భక్తిపారవశ్యంలో తేలుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..