AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarpanch Protest: హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ దగ్గర టెన్షన్‌..టెన్షన్‌.. నిధుల కోసం రోడ్డెక్కిన తెలంగాణలో సర్పంచ్‌లు..

కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చే డబ్బును కూడా ఆపేస్తుందని ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్ నిధుల కోసం ధర్నా చౌక్ లో ఆందోళనకు పిలుపునిచ్చింది తెలంగాణ సర్పంచుల సంఘం.

Sarpanch Protest: హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ దగ్గర టెన్షన్‌..టెన్షన్‌.. నిధుల కోసం రోడ్డెక్కిన తెలంగాణలో సర్పంచ్‌లు..
Sarpanch Protest(file)
Sanjay Kasula
|

Updated on: Jan 02, 2023 | 9:36 AM

Share

నిధుల కోసం తెలంగాణలో సర్పంచులు ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చే డబ్బును కూడా ఆపేస్తుందని ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్ నిధుల కోసం హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఆందోళనకు పిలుపునిచ్చింది తెలంగాణ సర్పంచుల సంఘం. పంచాయతీలకు కేటాయించిన కేంద్రం, ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచులు మండిపడుతున్నారు. పంచాయతీలకు హక్కుగా వచ్చిన కేంద్ర నిధులను ఇతర పథకాలకు వాడుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల (జీపీ) అకౌంట్లను ఫ్రీజ్‌ చేయడంతో ఎనిమిది నెలలుగా తమకు కేంద్ర నిధులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గత వారంరోజుల్లో రెండు విడతలుగా కేంద్ర నిధులు జమయ్యాయని స్పష్టంచేశారు. కానీ జమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం ఖాళీ చేసిందని వెళ్లడించారు.

జీపీల కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలకు కేంద్రం నిధులు ఇస్తే.. వాటిని రాష్ట్రం ఎలా వాడుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం నిధులను పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, హరితహారం, అభివృద్ధి పనులకే వినియోగించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎనిమిది నెలలుగా ఎస్‌ఎఫ్‌సీ నిధులు విడుదల చేయలేదని, దీంతో ట్రాక్టర్లలో డీజిల్‌ పోయలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఈ ధర్నాకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడంతో వరుసగా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఉదయాన్నే హౌస్ అరెస్ట్ చేశారు. మల్లు రవి ఇతర జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలను కూడా ఎక్కడికి అక్కడ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. అరువైపు అనుమతి లేదంటున్న కచ్చితంగా ధర్నా చేసి తీరుతాం అంటున్నాయి సర్పంచ్ సంఘాలు. దీంతో ధర్నా చౌక్ దగ్గర కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను హౌస్‌ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.

ఇప్పటికే వి. హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, మల్లు రవి,తదితరులు హౌస్ అరెస్ట్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హౌస్ అరెస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!