Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjanar: ఆ సంస్థను బ్యాన్ చేసి.. ఆస్తులన్నీ జప్తు చేయాలి.. TSRTC MD సజ్జనార్ డిమాండ్..

అమాయకులను టార్గెట్ చేసుకుని మోసం చేస్తున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెనేజింగ్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సూచించారు. దేశంలో కొనసాగుతున్న క్యూనెట్ అరాచకాలపై ఆయన తాజాగా ట్వీట్ చేశారు.

Sajjanar: ఆ సంస్థను బ్యాన్ చేసి.. ఆస్తులన్నీ జప్తు చేయాలి.. TSRTC MD సజ్జనార్ డిమాండ్..
Sajjanar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 31, 2023 | 10:51 AM

అమాయకులను టార్గెట్ చేసుకుని మోసం చేస్తున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెనేజింగ్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సూచించారు. దేశంలో కొనసాగుతున్న క్యూనెట్ అరాచకాలపై ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దేశంలో క్యూనెట్ అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని.. ప్రజలు మోసం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ TSRTC MD సజ్జనార్ ట్వీట్ చేశారు. గొలుసు కట్టు పద్ధతిలో అమాయకులను టార్గెట్ చేసుకుని.. మోసం చేస్తున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. మోసపూరిత క్యూనెట్ కంపెనీ కార్యకలపాలపై సమగ్ర విచారణ జరపాలని.. ఆ సంస్థను తక్షణం మూసివేసి ఆస్తులన్నీ జప్తు చేయాలంటూ సజ్జనార్ ప్రభుత్వాన్ని కోరారు.

సజ్జనార్ ట్వీ్ట్..

‘‘దేశంలో క్యూనెట్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేష్ కన్నాతో సహా ముగ్గురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వప్న లోక్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్ ఆరుగురు అమాయకపు యువకులను పొట్టనబెట్టుకుంది. ఈ వ్యవహారంలో ఆర్గనైజర్లతో పాటు ఏజెంట్లనూ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్ అరెస్ట్ చేయాలి. మోసపూరిత క్యూనెట్ కంపెనీ కార్యకలపాలపై సమగ్ర విచారణ జరపాలి. ఆ సంస్థను తక్షణం మూసివేసి ఆస్తులన్నీ జప్తు చేయాలి. గొలుసు కట్టు పద్ధతిలో అమాయకులను టార్గెట్ చేసుకుని.. మోసం చేస్తున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..