Hyderabad: ఈ సండే హైదరాబాదీలకు జాలీడే.. ట్యాంక్‌బండ్‌పై నేటి ప్రత్యేకతలు ఇవే.. వాహనదారులు అలర్ట్‌.

Hyderabad: ఎప్పుడూ ట్రాఫిక్‌ రణగోణ ధ్వనులతో గందరగోళంగా ఉండే ట్యాంక్‌బండ్‌ అందాలను ప్రశాంతంగా వీక్షించేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక..

Hyderabad: ఈ సండే హైదరాబాదీలకు జాలీడే.. ట్యాంక్‌బండ్‌పై నేటి ప్రత్యేకతలు ఇవే.. వాహనదారులు అలర్ట్‌.
Follow us

|

Updated on: Oct 03, 2021 | 10:09 AM

Hyderabad: ఎప్పుడూ ట్రాఫిక్‌ రణగోణ ధ్వనులతో గందరగోళంగా ఉండే ట్యాంక్‌బండ్‌ అందాలను ప్రశాంతంగా వీక్షించేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ ఆదివారం సండే ఫండే పేరుతో ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలను అనుమతించట్లేదు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.

ఈ ఆదివారాన్ని మరింత జాలీగా మార్చడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే నేడు (అక్టోబర్‌ 3)న జరగబోయే ఫన్‌డే కార్యక్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు గాను 20 మందితో కూడిన కళాకారుల బృందం ట్యాంకుబండ్‌ పొడవునా పులివేషాలతో సందర్శకులను ఆకట్టుకోనున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ బ్యాండ్‌ తమ వాయిద్య సంగీతంతో అలరించనుంది.

ట్రాఫిక్‌ ఆంక్షలు..

* లిబర్టీ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలు అంబేద్కర్‌ విగ్రహం నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ కింద నుంచి ఇక్బాల్‌ మినార్‌ మీదుగా వెళ్లాలి.

* తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ కింద నుంచి ట్యాంక్‌ బండ్‌కు వచ్చే వారు అంబేద్కర్‌ విగ్రహం మీదుగా లిబర్టీ హిమాయత్‌నగర్‌ వైపు వెళ్లాలి.

* కర్బాలా మైదాన్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ వైపు వచ్చే వాహనదారులు సెయిలింగ్‌ క్లబ్‌ నుంచి కవాడిగూడ, డీబీఆర్‌ మిల్స్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ మీదుగా మళ్లిస్తారు.

* అలాగే డీబీఆర్‌ మిల్స్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి వచ్చే వారిని. డీబీఆర్‌ మిల్స్, గోశాల, కవాడిగూడ, జబ్బార్‌ కాంప్లెక్స్‌, బైబిల్‌ హౌస్‌ మీదుగా మళ్లిస్తారు.

* ఇక ఇక్బాల్‌ మినార్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే వారిని పాత సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా మళ్లిస్తారు.

వాహనాదారులు పార్కింగ్ ఎక్కడ చేసుకోవచ్చంటే..

* అంబేద్కర్‌ విగ్రహాం లేపక్షి.

* డాక్టర్‌ కార్స్‌

* న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, ఆదర్శనగర్‌.

* న్యూ సెక్రటేరియట్‌.

* బుద్ధ భవన్‌ వెనకాల

* ఎన్టీఆర్‌ గార్డెన్‌.

Also Read: Spirulina Farming: తక్కువ పెట్టు బడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట స్పిరులినా.. ఎలా పండించాలంటే..

Maa Elections 2021: సినీ పరిశ్రమలో మా ఎన్నికల హీట్.. బరిలో ఉన్న అభ్యుర్థుల జాబితా ఇదే..

Badvel By Poll Boycott: కడప జిల్లా బద్వేల్ బై ఎలక్షన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు