Samantha – Naga Chaitanya: బ్యాడ్ న్యూస్‌లోనూ గుడ్ థింగ్.. చైతూ-సమంత మళ్లీ రీల్ మీద కలిసి..
నాగ చైతన్య, సమంత ఇద్దరూ ట్వీట్టర్‌లో విడాకుల నామాను పోస్ట్ చేశారు. కానీ అంత అన్యోన్యంగా ఉండే ఆ జంట అంతలోనే.. ఎందుకు ఇలాంటి నిర్ణయం
Samantha Naga Chaitanya Akkineni Divorce: నాగ చైతన్య, సమంత ఇద్దరూ ట్వీట్టర్‌లో విడాకుల నామాను పోస్ట్ చేశారు. కానీ అంత అన్యోన్యంగా ఉండే ఆ జంట అంతలోనే.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందనే సందేహాలు మాత్రం అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. తెరపై హిట్ పెయిర్. రియల్ లైఫ్‌లోనూ రోమాంటిక్ కపుల్. రెండక్షరాల ప్రేమలా.. వాళ్లిద్దరి గుండె చప్పుడు ఒకటే. కానీ.. వాళ్ల అనుబంధానికి డైవోర్స్ కార్డ్ పడింది.
ఏం మాయ చేశావే సినిమాతో.. ఒకరి మాయలో ఒకరు పడిపోయారు. సుమారు 11 ఏళ్ల పాటు వీళ్ల ప్రేమకు.. నాలుగేళ్ల వివాహ బంధానికి ఊహించని ముగింపు పడింది. మనం మూవీలో చైతు-సమంత పెయిర్ ఇప్పుడు రీళ్లు తిరుగుతోంది. వాళ్లిద్దరూ అలానే కలిసి వుండాలని అందరు కోరుకున్నారు. కానీ కలిసి వుండాలా..విడిపోవాలా అని నిర్ణయించుకునే నిర్ణేతలు వాళ్లద్దరే.
కారణాలేవైనా.. ఓ నిర్ణయం తీసుకున్నారు. స్వాగతించమని హుందగా రిక్వెస్ట్ చేశారు. ఐతే బంధాన్ని నిలపెట్టుకునేందుకు ప్రయత్నాలు జరిగాయా? సమంత టెంపుల్ రన్నే అందుకు నిదర్శనమా? చైతు, సమంత ఇద్దరూ తమ చేతిపై ఒకేలా ఓ టాటూ ఉండేది. దానర్ధం.. రియలిస్టిగ్ ఉండాలి. మనసుకు నచ్చినట్టుగా బతకాలనేది టాటూ మీనింగ్ . ఆ విషయాన్ని ఇద్దరూ ఎంతో ఆనందంగా చెప్పారు కూడా. మరి చేతిలో చెయ్యేసి చెప్పిన బాసలు ఎందుకు మారాయి? మారడానికి కారణాలేంటి? పరిస్థితులేంటి? అనే ఊహాగానాలు వెంటాడుతున్నాయి.
కారణాలేవైనా చైతు-సామ్ విడిపోయారు. చాలాదురదృష్టకరమంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు నాగార్జున. అది వారి వ్యక్తిగత జీవిత నిర్ణయమనీ.. వాళ్లిద్దరూ తమకు సమానమేనన్నారు. శామ్ ఎప్పటికీ తమ కుటుంబానికి ఆత్మీయురాలేనన్నారు నాగ్. ఇక నాగ్- సామ్ అంటే మాడ్రనేజ్ మామకోడళ్లు. నాగ్ అంటే ఆమెకు ఎంతో గౌరవం. అభిమానం. కానీ నాగ్ బర్త్ డేకు విషెష్ చెప్పారే ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లో సామ్ కన్పించలేదు. కానీ ట్వీట్స్ ద్వారా మామపై తన అభిమానం చాటుకున్నారు సామ్.
సమంత- చైతుల విడాకులపై స్పందించారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. పెళ్లిని కాదు సెల్రబేట్ చేసుకోవాల్సింది డైవోర్స్‌నంటూ ట్వీట్ చేశారాయన. విడాకులు స్వర్గంలో నిర్ణయించబడతాయంటూ ఆయన తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. మంతతో ఇంటిమేట్ రిలేషన్ వున్న చిన్మయి శ్రీపాద నుంచి పాత స్నేహితుడు సిద్ఱార్థ్ వరకూ చాలా డెప్తీ రియాక్షన్ ఇచ్చారు. మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరు అంటూ సిద్ఱార్థ్.. చేసిన ట్వీట్ ఆసక్తి కరంగా వుంది.
ఇక ఎప్పుడూ పుట్టింటి గురించి పెద్దగా ప్రస్తావించని సమంత… రీసెంట్ టైమ్స్ లో ఇన్‌స్టా స్టోరీస్‌లో కన్నతల్లి ప్రస్తావన తీసుకురావడం కూడా చాలా మందిని ఆలోచనలో పడేసింది. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్. అవసరంలేకుండా హడావుడి చేయోద్దనే తత్వం చైతన్యది. ఈ క్రమంలో ఏమైనా అభిప్రాయభేదాలు వచ్చాయా.. లేక ఫ్యామిలీ మేన్2 తరహా ప్రాజెక్టులు ఫర్‌దర్‌గా చేయడానికి ఫ్యామిలీ నుంచి నిజంగా ఇబ్బందులు ఎదురయ్యాయా? పిల్లలు ఎప్పుడు అనే ప్రశ్నలు పదే పదే వినిపించాయా? ఆ క్రమంలో అక్కినేని కుటుంబం నుంచి ఏమైనా ఒత్తిడి పెరిగిందా? ఇలా.. ఎవరి ఊహాగానాలు వారివి.
నో..డౌట్. వాళ్లిద్దర్నీ కలిపింది సినిమానే. సినిమాలే. కలిసి నటించిన సినిమాలు ఇద్దర్నీ ఒకటి చేస్తే.. విడివిడిగా కలిసొచ్చిన సినిమాలే విడాకులకు దారి తీశాయా?.. ఇప్పుడితే చర్చ జరుగుతోంది. కానీ విడిపోవడానికి దారి తీసిన కారణాలపై వివరణ లేదు. ఎవరి మనుసులో ఏముందో వారికి కాక ఇంకెవరికి తెలుసు? బ్యాడ్ న్యూస్‌లోనూ గుడ్ థింగ్ ఏంటంటే.. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే కాకుండా.. స్నేహాన్ని కొనసాగిస్తామని చెప్పడం. చైతూ – సమంత మళ్లీ రీల్ మీద కలిసి నటిస్తే చూడాలని.. చాలా మంది అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇదే చర్చ జరుగుతోంది.
Read also: Badvel By Poll Boycott: కడప జిల్లా బద్వేల్ బై ఎలక్షన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు