Maa Elections 2021: సినీ పరిశ్రమలో మా ఎన్నికల హీట్.. బరిలో ఉన్న అభ్యుర్థుల జాబితా ఇదే..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి (మా) ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ప్రచారాలు, విమర్శలు,
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి (మా) ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ప్రచారాలు, విమర్శలు, అనుహ్య ట్వీస్టులతో సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందే సినీ పరిశ్రమలో చర్చలతో హీటెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తమ తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అయితే అనుహ్యాంగా.. జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్.. అధ్యక్ష పదవి కోసం చేస్తున్న సీవీఎల్ సైతం తమ నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పుడు మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మాత్రమే పోటీలో ఉన్నారు. ఆది నుంచి వీరిద్ధరి మధ్యే పోటీ ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఇరువురి ప్యానల్ సభ్యులు బహిరంగ విమర్శలు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే అదే రోజున సాయంత్రం ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో బండ్లగణేష్, సీవీఎల్ తమ నామినేషన్స్ ఉపసహరించుకోవడంతో మా ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు. ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. అలాగే.. వైస్ ప్రెసిడెంట్ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బెనర్జీ, హేమలు పోటీ చేస్తుండగా.. విష్ణు ప్యానల్ నుంచి మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీ పడుతున్నారు. అలాగే జనరల్ సెక్రటరీ పదవికి.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత రాజశేఖర్ పోటీపడుతుండగా.. విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు పోటీ చేస్తున్నారు. ఇక కోశాధికారి పదవికి శివబాలాజీ.. నాగినీడు.. రెండు జాయింట్ సెక్రెటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ చేస్తున్నారు. ఇక అసోసియేషన్లో 18 ఈసీ పోస్టులకు మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.