AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి ఆ బాలీవుడ్‌ స్టారో హీరోనే కారణం.. కంగనా సెన్సేషన్ కామెంట్స్‌.

Kangana: నాగ చైతన్య, సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట విడిపోవడంతో..

Kangana: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి ఆ బాలీవుడ్‌ స్టారో హీరోనే కారణం.. కంగనా సెన్సేషన్ కామెంట్స్‌.
Narender Vaitla
|

Updated on: Oct 03, 2021 | 8:16 AM

Share

Kangana: నాగ చైతన్య, సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట విడిపోవడంతో చైసామ్‌ ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు. ఇక సినిమాలపై ఆసక్తిలేని వారు కూడా ఈ జంట విడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు చైతన్య కానీ, ఇటు సమంత కానీ తాము విడిపోవడానికి గల కారణమేంటో మాత్రం వెల్లడించలేదు.

ఇదిలా ఉంటే ఈ జంట విడిపోవడానికి ఇదే కారణమంటూ ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా వీరి విడాకులకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. ఈ జంట విడాకులకు కారణాలపై రకరకలా చర్చలు జరుగుతోన్న సమయంలో బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌ మరో ఆసక్తికర చర్చకు తెర తీశారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఓ బాలీవుడ్‌ హీరోనే కారణమంటూ సెన్సేషన్‌ పోస్ట్‌ చేశారు.

Kangana

వివరాల్లోకి వెళితే.. కంగనా రనౌత్‌ నాగచైతన్య, సమంతల విడాకును ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రెండు పోస్టులు చేశారు. ఇందులో మొదటి పోస్టులో.. ’10 ఏళ్లుగా ప్రేమం బంధంలో ఉండి, నాలుగేళ్లుగా వివాహా బంధంలో ఉండి.. విడాకులు తీసుకున్న ఓ సౌత్‌ ఇండియా హీరో.. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోతో పరిచయమ్యారు. ఆ బాలీవుడ్‌కు హీరో విడాకుల స్పెషలిస్ట్‌గా పేరుంది. అతను ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. ఆయన సూచనలు, సలహాల మేరకే సౌత్‌ హీరో విడాకుల నిర్ణయం తీసుకున్నాడు’ అంటూ సెన్సేషన కామెంట్‌ చేశారు. ఈ పోస్ట్ చూసిన వారికెవరికైనా కంగనా అమీర్‌ ఖాన్‌ను ఉద్దేశించి వ్యాఖలు చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే నాగచైతన్య ఇటీవల బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌తో కలిసి లాల్‌ సింగ్ చద్దా అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Kangana 1

ఇదిలా ఉంటే కంగా మరో పోస్టులో యావత్‌ మగ జాతినే నిందించారు. ఈ క్రమంలో ఆమె పోస్ట్‌ చేస్తూ.. ‘సమాజంలో విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకొచ్చినా అందులో మగాడిదే తప్పు ఉంటుంది. దేవుడు అలా సృష్టిని తయారుచేశాడు మగాళ్లు వేటగాళ్లుగా, మహిళలు బలిపశువులుగా మారడం ఆనవాయితీ. దుస్తులు మార్చినంత ఈజీగా ఆడవాళ్లను మార్చేసే పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ హాట్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. మరి కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై అమీర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్‏తో నాని భారీ ప్లాన్.. పాన్ ఇండియా దిశగా కసరత్తులు చేస్తోన్న న్యాచురల్ స్టార్..

Bigg Bos 5 Telugu: కూర్చుని కబుర్లు చెబుతున్నావ్ .. సిరి-షణ్ముఖ్ జోడిపై నాగ్ అసహనం..

Samantha Divorce: కొత్త ఆలోచన రేకెత్తిస్తోన్న సమంత కామెంట్స్.. క్యాస్టింగ్ కౌచ్ మొదలు.. ఫుడ్, సెక్స్ సహా అన్నింటిపై తేల్చేసిన శామ్.!