AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Divorce: కొత్త ఆలోచన రేకెత్తిస్తోన్న సమంత కామెంట్స్.. క్యాస్టింగ్ కౌచ్ మొదలు.. ఫుడ్, సెక్స్ సహా అన్నింటిపై తేల్చేసిన శామ్.!

పుకార్లు నిజమయ్యాయి. ఇక తాము కలిసి ఉండలేమంటూ నాగచైతన్య, సమంతలు ప్రకటించారు. ఇప్పుడు సమంత చేసిన కామెంట్స్ కొత్త ఆలోచనను రేకెత్తిస్తున్నాయి.

Samantha Divorce: కొత్త ఆలోచన రేకెత్తిస్తోన్న సమంత కామెంట్స్.. క్యాస్టింగ్ కౌచ్ మొదలు.. ఫుడ్, సెక్స్ సహా అన్నింటిపై తేల్చేసిన శామ్.!
Samantha 2
Venkata Narayana
|

Updated on: Oct 03, 2021 | 7:00 AM

Share

Samantha – Naga Chaitanya Divorce: పుకార్లు నిజమయ్యాయి. ఇక తాము కలిసి ఉండలేమంటూ నాగచైతన్య, సమంతలు ప్రకటించారు. ఇప్పుడు సమంత చేసిన కామెంట్స్ కొత్త ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టేసిందామె. క్యాస్టింగ్ కౌచ్ మొదలు ఫుడ్, సెక్స్ సహా అన్నింటిపై తేల్చేసింది. పైగా కొందరు ద్రోహులు, దుర్మార్గులు ఉన్నారు.. వాళ్లు సర్వనాశనమైపోతారంటూ సమంత టాలీవుడ్‌లో డిబేట్‌కు తెరతీశారు.

నో కాంప్రమైజ్. ఎవరి దారి వారిదే. నాలుగేళ్ల బంధం విచ్ఛిన్నమైంది. చూడముచ్చటైన నిండు నూరేళ్ల జీవితం ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బంధాలు, బంధుత్వాల ముందు పంతాలు, పట్టింపులే ప్రాధామ్యాలుగా మిగిలాయి. మొత్తంగా చైతు, సమంత దంపతులు మా విడాకులు అంటూ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ హాట్‌ హాట్‌గా మారాయి.

సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సమంతా.. డేరింగ్‌, డాషింగ్‌ కామెంట్స్‌ చేస్తూనే ఉంటుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ అనుమానాలపై క్లారిటీ ఇస్తుంది. అందులోనూ ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆహారం కంటే సెక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అంతే కాదు పలు మార్లు సినీ ఇండస్ర్టీని ఊపేసిన కాస్టింగ్‌ కౌచ్‌పై కూడా హాట్‌ కామెంట్‌ చేసింది శామ్. దేనిపైనా వెనుకాడకుండా బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చింది.

పదేళ్ల పాటు స్నేహం చేసిన నాగచైతన్యను పెళ్లి చేసుకుంది సమంత. అప్పటి నుంచి ఆమె ప్రెగ్నేన్సీపై పుకార్లు షికార్లు చేశాయి. తరచు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ ఇదే క్వశ్చన్‌పై పదే పదే అడిగేవారు. అన్నింటికి సహనంతో ప్రతీసారి ఆన్సర్ చేసేది సమంత. 2017 నుంచి తాను గర్బవతిగా ఉన్నాను.. కాని ఆ బిడ్డ బయటకు రావాలని అనుకోవడం లేదని కామెంట్‌ చేసింది. ఈ కామెంట్‌ చేయడానికి కూడా ధైర్యం కావాలి. మరో ఇంటరాక్టివ్ సెషన్‌లో ఒక అభిమానికి సమాధానమిచ్చిన సమంత.. 2022 ఆగస్టు 7న బిడ్డను కనబోతున్నానంటూ కామెంట్‌ చేశారు.

కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్. ఇండస్ట్రీ ఏదైనా కాస్టింగ్ కౌచ్‌ వెంటాడుతోంది. ఇతరుల మాదిరి కాకుండా పరిశ్రమలో తాను కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవించాల్సిన అసవసరం లేదన్నారు. కాస్టింగ్ కౌచ్ సినిమా పరిశ్రమలోనే కాదు ప్రతి పరిశ్రమలోనూ ఉందని క్లారిటీ ఇచ్చారు. కొన్ని నల్లగొర్రెలు కూడా ఎక్కడైనా ఉంటాయంటూ చెడ్డవారి గురించి ప్రస్తావించింది. అలా అని పరిశ్రమలో చాలా మంది మంచి వారు కూడా ఉన్నారంటోంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిశీలించడానికి ప్రభుత్వం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.

పురుష ఆధిపత్య పరిశ్రమలో భాగంగా ఉన్నా..సమంత తన పనితో తనకంటూ ఓ ప్రత్యేతకతను చాటుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సూపర్‌స్టార్‌లలో ఒకరుగా నిలిచింది. పురుషుల ఆధిక్యంలో ఉన్నా మన ధైర్యంతో మనం ముందుకు వెళ్లొచ్చని పిలుపునిచ్చారు.

వాస్తవానికి సమంత నుంచి ఎవరూ ఇలాంటి కామెంట్ ఊహించ ఉండరు. కాని ఆమె చేసిన కొన్ని కామెంట్స్‌ ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి. ఫుడ్‌, సెక్స్‌ రెండూ ముఖ్యమే. వాటిలో ఫుడ్‌ కంటే సెక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కుండబద్దలు కొట్టారామె. వాస్తవానికి సమంత యాక్టింగ్‌ లైఫ్‌కి బ్రేక్‌ ఇస్తారని న్యూస్‌ వైరల్‌ అయింది. తాను మాత్రం బ్రేక్‌ తీసుకునే ఆలోచన లేదంటున్నారు.

Samantha

Samantha

Read also: Indo – China: డ్రాగన్‌ కంట్రీపై వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టిన భారత సైన్యం