Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ట్విస్ట్ మాములుగా లేదు.. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే..

బిగ్‏బాస్ సీజన్ 5 నాలుగో వారం కూడా పూర్తికావస్తుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‏తో ప్రారంభమైన బిగ్‏బాస్.. మొదటి వారం

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ట్విస్ట్ మాములుగా లేదు.. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 03, 2021 | 9:52 AM

బిగ్‏బాస్ సీజన్ 5 నాలుగో వారం కూడా పూర్తికావస్తుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‏తో ప్రారంభమైన బిగ్‏బాస్.. మొదటి వారం నుంచి అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇక ఈసారి ఇంట్లోకి తెలియని ముఖాలు ఎక్కువగానే వచ్చాయి. పాపులారిటీ ఉన్నవాళ్లు కాకుండా.. జనాలకు అంతగా తెలియని ముఖాలు చాలానే వచ్చాయి. ఇక మొదటి వారం నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రేక్షకులు ఊహించినట్టుగానే జరుగుతుంది. మొదటి వారంలో సరయూ.. రెండవ వారంలో ఉమాదేవి.. మూడోవారంలో లహరి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. ఈ వారం ఎలిమినేషన్‏లో సన్నీ, కాజల్, లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్, ప్రియ ఉన్నారు.

ఇక వీరిలో ఎక్కువగా డెంజర్ జోన్‏లో ఉన్నది మాత్రం యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, లోబో.. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే గత కొద్దిరోజులుగా యానీ మాస్టర్ ఎలిమినేట్ కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. పలు వెబ్సైట్స్ నిర్వహించిన పోల్స్‏లోనూ యానీ మాస్టర్ ఎలిమినేట్ కానున్నట్లుగా రిజల్ట్ రావడంతో అంతా యానీ మాస్టర్ ఇంటి నుంచి వెళ్లనున్నట్లుగా టాక్ నడిచింది. అయితే తాజాగా వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. తక్కువ ఓటింగ్‏తో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టుగా సమాచారం. మొత్తానికి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది మాత్రం నటరాజ్ మాస్టర్ అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. మిగతా ఇంటి సభ్యులు చెప్పింది వినకపోవడం.. అంతా తనకే తెలుసు.. నేను జీవితంలో అన్ని భరించాను.. అంటూ మిగతా ఇంటి సభ్యులను చులకనగా చూడడం … అలాగే ఇంటి సభ్యులను జంతువులతో పోలుస్తూ వారికి పేర్లు పెట్టడంతో నెటిజన్స్ నటరాజ్ మాస్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఈసారి ఇంటి నుంచి నటరాజ్ మాస్టర్‏ను బయటకు పంపించాలనుకున్నారట నెటిజన్స్. మరి నిజంగానే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడా ? లేదా ? అనేది తెలియాలంటే.. ఈరోజు రాత్రి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read: Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్‏తో నాని భారీ ప్లాన్.. పాన్ ఇండియా దిశగా కసరత్తులు చేస్తోన్న న్యాచురల్ స్టార్..

Bigg Boss 5 Telugu: నా వరకు నేను కరెక్ట్.. బరాబర్ చేశా.. లోబోను కడిగిపారేసిన నాగ్..