Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్‌తో నాని భారీ ప్లాన్.. పాన్ ఇండియా దిశగా కసరత్తులు చేస్తోన్న న్యాచురల్ స్టార్..
న్యాచురల్ స్టార్ నాని... సినీ ఇండస్ట్రీలోనే స్పెషల్ ఇమేజ్.. యూత్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం అమితంగా ఇష్టపడే
న్యాచురల్ స్టార్ నాని… సినీ ఇండస్ట్రీలోనే స్పెషల్ ఇమేజ్.. యూత్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం అమితంగా ఇష్టపడే హీరో. నటనలో సహజత్వం.. పక్కింటి అబ్బాయిగా అనిపిస్తాడు నాని. అలాగే.. నాని సినిమాలు ప్రత్యేకం. కంటెంట్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని నాని ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు నాని చేసిన అన్ని సినిమాలను జనాలు ఎక్కువగా ఆదరించారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ హీరోతో సినిమాలను చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ వరుస ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇటీవలే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. మంచి టాక్ సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్.. పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే.. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్స్ గా మారగా.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సైతం పాన్ ఇండియా స్టార్ గా మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక అదేబాటలోకి న్యాచురల్ స్టార్ నాని వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం సన్నాహాలు సైతం చేస్తున్నారని టాక్. ఇక ప్రస్తుతం నాని.. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి చిత్రాలను చేస్తున్నాడు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్.. శ్యామ్ సింగరాయ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నానికి జోడిగా.. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ శ్యామ్ సింగరాయ్ చిత్రంపై ఆసక్తిని పెంచేశాయి.
Also Read:
Bigg Bos 5 Telugu: కూర్చుని కబుర్లు చెబుతున్నావ్ .. సిరి-షణ్ముఖ్ జోడిపై నాగ్ అసహనం..
Bigg Boss 5 Telugu: నా వరకు నేను కరెక్ట్.. బరాబర్ చేశా.. లోబోను కడిగిపారేసిన నాగ్..