Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.. కన్నీళ్ళు వస్తున్నాయంటూ ఎమోషనల్ అయిన నాగ్..
బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.. సీజన్ 5 నాలుగో వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా మారింది.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.. సీజన్ 5 నాలుగో వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా మారింది. నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్, లోబో, ప్రియ, యాంకర్ రవి, సిరి, సన్నీ, కాజల్.. ఈ ఎనిమిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఈవారంలో మొత్తం ఎనిమిది మంది నామినేట్ కావడంతో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని అంతా అనుకున్నారు. కానీ ఒక్కరు మాత్రమే ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. అయితే ఈవారం హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇదిలా ఉంటే నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడుతా సినిమా 25ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హౌస్ మేట్స్ అంతా నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సినిమాలో పాటలకు అదిరిపోయే డాన్స్ లు వేస్తూ ఆకట్టుకున్నారు. జంటలుగా విడిపోయి మరీ డాన్స్ చేశారు హౌస్ మేట్స్.. వీరిలో హమీద -శ్రీరామ్.. అలాగే షన్ను- సిరీ డాన్స్ ఆకట్టుకుంది. ఇక హౌస్ మేట్స్ డాన్స్ కు నాగ్ ఫిదా అయ్యారు. నా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి అంటూ ఎమోషనల్ అయ్యారు నాగ్. ఆతర్వాత ప్రియాంకాతో మాట్లాడుతూ… విశ్వాను అన్నయ్య అన్నా పర్లేదు కానీ సన్నీ మాత్రం అనవద్దు అన్నాడు నాగ్. దాంతో సన్నీ లేకి దండం పెట్టేసాడు.. ఇక ప్రియాంక విశ్వ ఓ రొమాంటిక్ సాంగ్ కు డాన్స్ తో అదరగొట్టారు.. దానికి నాగ్ నేను వాళ్ళు డాన్స్ చేస్తుంటే మానస్ రియాక్షన్స్ మాత్రమే చూస్తున్నా అంటూ సెటైర్ వేశాడు. ఆ తర్వాత మానస్ వెంటపడింది ప్రియా ఆమెనుంచి తప్పించుకునే క్రమంలో స్విమింగ్ పూల్‌లో పడిపోయాడు మానస్. ఇలా సందడిగా సాగింది నేటి ఎపిసోడ్..
Housemates celebrates #25YearsOfNinnePelladatha for King @iamnagarjuna ❤️ .. Special telecast today at 3 PM#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun #SundayFunday pic.twitter.com/IBTsipJGs2
— starmaa (@StarMaa) October 3, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :