Mahesh Babu: స్పెయిన్‌ బాట పట్టిన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ .. ఓ వైపు షూటింగ్‌ మరోవైపు ఫ్యామిలీ ట్రిప్‌..

Mahesh Babu: కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో నటుడు మహేష్‌ బాబు మొదటి వరుసలో ఉంటారు. కాస్త ఖాళీ సమయం దొరికినా సరే కుటుంబంతో సహా వెకేషన్‌కు...

Mahesh Babu: స్పెయిన్‌ బాట పట్టిన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ .. ఓ వైపు షూటింగ్‌ మరోవైపు ఫ్యామిలీ ట్రిప్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 03, 2021 | 1:53 PM

Mahesh Babu: కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో నటుడు మహేష్‌ బాబు మొదటి వరుసలో ఉంటారు. కాస్త ఖాళీ సమయం దొరికినా సరే కుటుంబంతో సహా వెకేషన్‌కు వెళుతుంటారు. ముఖ్యంగా మహేష్ కుటుంబసభ్యులతో విదేశాలను సందర్శిస్తుంటారు. నమ్రతతో పాటు పిల్లలు సితార, గౌతమ్ అందరూ కలిసి టూర్స్‌ వేస్తుంటారు. ఈ క్రమంలోనే కుటుంబంతో గడిపిన క్షణాలను నటి నమ్రతా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్‌. తాజాగా తదుపరి షెడ్యూల్‌లో భాగంగా స్పెయిన్‌ వెళ్లినట్లు తెలుస్తోంది.

మహేష్‌ ఎయిర్‌ పోర్ట్‌ ఫోటోలు..

గోవా, హైదరాబాద్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న తర్వాత చిత్ర యూనిట్‌ తదుపరి షెడ్యూల్‌ కోసం అక్టోబర్‌ 1న స్పెయిన్‌ వెళ్లారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో మహేష్‌ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. సర్కారు వారి పాటకు సంబంధించి కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి స్పెయిన్‌ బాట పట్టారు.

నమ్రతా పోస్ట్‌..

ఇదిలా ఉంటే తాజాగా మహేష్ సతీమణి నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన పోస్ట్‌ చూస్తుంటే మహేష్‌ కుటుంబ సభ్యులు కూడా స్పెయిన్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. కూతురు సితారతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేసిన ఈ సూపర్‌ మామ్‌.. ‘మధుర జ్ఙాపకాలను సొంతం చేసుకోవడానికి మరో టూర్‌కు వెళుతన్నాం. స్పెయిన్‌ మేము వచ్చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే మహేష్‌ బాబు ఓవైపు షూటింగ్‌ను మరోవైపు ఫ్యామిలీ హాలీడేను కూడా పూర్తి చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక మహేష్‌ సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.

Also Read: Kodali Nani: జగన్‌ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు.. తన మార్క్ కామెంట్స్ చేసిన మినిస్టర్ కొడాలి నాని

Rakul Preet Singh: అదిరే అందాలతో కవ్విస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ మెస్మరైజింగ్‌ ఫొటోలు

Samantha: నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌.. నెట్టింట వైరల్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!