Kodali Nani: జగన్‌ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు.. తన మార్క్ కామెంట్స్ చేసిన మినిస్టర్ కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. జనసేనాని సడెన్‌గా యాక్టివ్ అవ్వడం.. ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారంటూ ఏపీ సర్కార్‌పై...

Kodali Nani: జగన్‌ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు.. తన మార్క్ కామెంట్స్ చేసిన మినిస్టర్ కొడాలి నాని
Kodali Nani
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2021 | 1:58 PM

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. జనసేనాని సడెన్‌గా యాక్టివ్ అవ్వడం.. ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారంటూ ఏపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా ఆయన చాలా అగ్రెసీవ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ మంత్రులు, నేతల నుంచి కూడా అదే స్థాయి కౌంటర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా టికెట్ల కోసం ఆన్‌లైన్  పోర్టల్ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని పవన్ తప్పుబట్టారు. తాజాగా సేనాని కామెంట్స్‌కు మరోసారి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని.  సినిమా టికెట్ల రేట్ల సమస్య.. గతం నుంచీ ఉందని చెప్పిన మంత్రి.. తాము కోర్టు ఆదేశాల ప్రకారమే కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నామన్నారు.  గతంలో.. నిర్మాతలు కోర్టుకు వెళ్తే.. కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయని.. అప్పుడు చంద్రబాబు సర్కార్ స్పందించలేదని పేర్కొన్నారు.

నలుగురు నిర్మాతలు, నలుగురు హీరోలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నిర్ణయాలు తీసుకోదని, అందరి సంక్షేమం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. సినిమా రంగానికి చెందిన వాళ్లు.. ఎలాంటి సౌకర్యాలు కోరినా.. ప్రభుత్వం తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. పవన్ విమర్శలు, హెచ్చరికలపైనా కొడాలి నాని రెస్పాండ్ అయ్యారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. జగన్ ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆ..హు.. అంటే,  అదిరి బెదిరి పోయే వాళ్ళము కాదన్నారు. పవన్ సినిమా హిట్టైనా.. ఫెయిలైనా.. ప్రభుత్వానికి వచ్చేది కానీ.. పోయేది కానీ ఉండదన్నారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నంలాంటి ప్రాంతాలలో మాత్రమే కాకుండా.. ఎక్కడైనా షూటింగులు చేసుకోవచ్చని.. అందుకు కావాల్సిన సౌకర్యాలు కోరితే.. తగిన సహాయాన్ని అందిస్తామని మంత్రి వెల్లడించారు.

Also Read: నడిసంద్రంలో రేవ్ పార్టీ.. కోట్లాది రూపాయల ఖర్చు.. పట్టుబడ్డ వారిలో షారూఖ్ ఖాన్ తనయుడు!

 నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌.. నెట్టింట వైరల్

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..