Mumbai Drug Bust: నడిసంద్రంలో రేవ్ పార్టీ.. కోట్లాది రూపాయల ఖర్చు.. పట్టుబడ్డ వారిలో షారూఖ్ ఖాన్ తనయుడు!

అక్కడా ఇక్కడా ఐతే దొరికిపోతామనుకున్నారేమో..ఏకంగా సముద్రంలోనే రేవ్‌ పెట్టేశారు. అది అలాంటి ఇలాంటి పార్టీ కాదు. లగ్జరీ షిప్‌లో హై ప్రొఫైల్‌ రేవ్‌ పార్టీ.

Mumbai Drug Bust: నడిసంద్రంలో రేవ్ పార్టీ.. కోట్లాది రూపాయల ఖర్చు.. పట్టుబడ్డ వారిలో షారూఖ్ ఖాన్ తనయుడు!
Ncb Busts Drug Party
Follow us

|

Updated on: Oct 03, 2021 | 11:39 AM

అక్కడా ఇక్కడా ఐతే దొరికిపోతామనుకున్నారేమో..ఏకంగా సముద్రంలోనే రేవ్‌ పెట్టేశారు. అది అలాంటి ఇలాంటి పార్టీ కాదు. లగ్జరీ షిప్‌లో హై ప్రొఫైల్‌ రేవ్‌ పార్టీ. కోట్లాది రూపాయల ఖర్చు..భారీగా డ్రగ్స్, ముద్దుగుమ్మలు, డీజే సౌండ్స్‌..ఇంకేముంది..నిషానిషాగా మస్త్‌ మజా చేసుకుంటున్నారు. పార్టీ పీక్స్‌కు చేరింది. కానీ ఇంతలోనే NCB అధికారులు ఎంట్రీ ఇచ్చేశారు. మాంచి మత్తులో ఉన్న పార్టీని భగ్నం చేసేశారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కొడుకుతో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో పలువురు యువతులు కూడా ఉన్నారు. భారీగా డ్రగ్స్‌తో పాటు లక్షల రూపాయలు నగదును సీజ్‌ చేశారు. NTPC యాక్ట్‌ కింద వారిని అరెస్ట్‌ చేసిన అధికారులు..ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.

అత్యంత విలాసవంతమైన కార్డీలియా క్రూయిజ్‌ లైనర్‌ అది. ముంబై నుంచి గోవాకు రెండు వారాల కిందటే ఈ క్రూయిజ్‌ లైనర్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. పార్టీ కోసం ఏకంగా ఆ క్రూయిజ్‌నే అద్దెకు తీసుకున్నారు. అంతా బడా బాబుల పుత్రరత్నాలే. ఈ పార్టీకి దాదాపు 1500మంది వరకు హాజరైనట్టు సమాచారం. కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి భారీగా డ్రగ్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఐతే ఈ పార్టీ గురించి పక్కా సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు..ప్రత్యేక బోట్లలో క్రూయిజ్‌ను పాలో అయ్యారు. రేవ్‌ పార్టీ గుట్టు రట్టు చేసేశారు. దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ బడా ఆపరేషన్‌కు NCB జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సారధ్యం వహించారు. కొకైన్, హషీష్, ఎండీఎంఏను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేశారు. ఐతే ఓ మ్యూజికల్‌ నైట్‌ కోసం ఈ క్రూయిజ్‌ లైనర్‌ను అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. మూడ్రోజుల పాటు మ్యూజికల్‌ వోయెజ్‌ పేరుతో ఈ పార్టీని ఏర్పాటుచేసినట్టు చెబుతున్నారు. వందలాది టికెట్స్‌ సేల్‌ అయ్యాయని..ఒక్కో టికెట్‌ ధర లక్ష రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. టాప్‌ సెలబ్రిటీలకు మాత్రమే ఈ టికెట్స్‌ అమ్మినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పట్టుబడినవారిలో ఓ బాలీవుడ్ బడా హీరో తనయుడు కూడా ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అతడు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ అని.. అతడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నిస్తోందని ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. ఆర్యన్ ఖాన్… షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల పెద్ద కుమారుడు. ఎన్‌సీబీ దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయంలో అతడిని ప్రశ్నిస్తోంది.

Shahrukh Son

Also Read: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత

విడాకులకు ముందుగానే చేతిపై సామ్ టాటూను చెరిపివేసిన నాగ చైతన్య

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక