TDP: రూ. 231 కోట్లతో వైయస్ విగ్రహమా..? ప్రశ్నిస్తే బూతులు తిట్టిస్తారు: మాజీ మంత్రి దేవినేని ఉమ

ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులను ఎంపిక చేసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో వాటిలో ఏం పనులుచేసిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ

TDP: రూ. 231 కోట్లతో వైయస్ విగ్రహమా..? ప్రశ్నిస్తే బూతులు తిట్టిస్తారు: మాజీ మంత్రి దేవినేని ఉమ
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 03, 2021 | 1:00 PM

AP Politics: ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులను ఎంపిక చేసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో వాటిలో ఏం పనులుచేసిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. ఆయా ప్రాజక్టులకోసం జగన్ సర్కారు ఎంత ఖర్చుపెట్టిందని ఆయన నిలదీశారు. ప్రతీ మూడు నెలలకోసారి ముఖ్యమంత్రి సాగునీటి రంగంపై సమీక్షలు చేస్తారు.. వివరాలు మాత్రం మీడియాకు రావు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

ఏపీలోని ప్రాజెక్ట్ లలో పనులు ఎక్కడివక్కడే ఉంటున్నాయి.. జూన్ 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి నీరిస్తామన్నారు. ఇంతవరకు అతీగతీలేదు అని దేవినేని ఉమ విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష వివరాల్లో, నిర్వాసితులకు కనీసం ఒక్కపేజీ కూడా కేటాయించలేదన్నారు. 29 నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో సాగునీటి రంగానికి ఎంతఖర్చుపెట్టారో.. ఎన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చారో, ఎందరు నిర్వాసితులను ఆదుకున్నారో చెప్పగలరా? అంటూ ఉమా ప్రశ్నించారు.

సాగునీటి రంగానికి సంబంధించిన పనులు, రైతులకు ఏం ఒరగబెట్టారనే పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయగల, దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నాయా? అని సవాల్ చేసిన దేవినేని ఈ క్రింది ప్రశ్నలను ఏపీ సర్కారుకి సంధించారు.

• ఏమైనా అడిగితే బూతులు తిట్టిస్తారు తప్ప, సమాధానం చెప్పరు? • పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులకోసం ముఖ్యమంత్రే నేరుగా ప్రధానమంత్రితో ఎందుకు మాట్లాడరు? • అధికారులు వెళ్లి డబ్బులు తీసుకొస్తే, ముఖ్యమంత్రి పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటాడా? • సాగునీటి రంగాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి కమీషన్ల కోసమే ప్రాజెక్టుల పనులంటూ నాటకాలాడుతున్నాడు. • తనకందాల్సిన కమీషన్లకోసం సాగునీటిరంగంపై పెత్తనాన్ని 5గురురెడ్లకుఅప్పగించాడు. • మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష పోలవరంలో తన తండ్రి విగ్రహం పెట్టడానికి.. • రూ.231కోట్లతో విగ్రహం ఏర్పాటు చేయడానికి అధికారులు పని చేయాలని ఆదేశించారు. • పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములిచ్చిన వారిని చెట్లపాలు చేసి, తన తండ్రి విగ్రహాలు పెట్టుకునే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? • పోలవరం ప్రాజెక్ట్ లో టీడీపీప్రభుత్వంలోచేసిన పనులతాలూకా ఈ ప్రభుత్వానికి రూ.4వేలకోట్లు కేంద్రం ఇస్తే, దాన్ని ఈ ముఖ్యమంత్రి లిక్కర్ కంపెనీలకు ఇచ్చాడు. • నిర్వాసితులకు రూపాయి ఇవ్వకుండా, వారికి అవసరమైన ఒక్కఇంటినీ కట్టించకుండా, వారిని గాలి కొదిలేశాడు… అంటూ ఉమ చెప్పుకొచ్చారు.

Read also: Budda: విజయసాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే డ్రగ్స్ వ్యవహారం గుట్టుమట్లు బయటపడతాయి: బుద్దా