Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: సిద్దార్థ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. తన మార్క్ కామెంట్.. అంతా గందరగోళం

ప్రజంట్ చిత్ర పరిశ్రమలో జరుగుతోన్న పరిణామాలు జనాల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఎవరు.. ఎందుకు రెస్సాండ్ అవుతున్నారో తెలియడం లేదు. సోషల్ మీడియా వేదికగా డైలాగ్స్ పేలుతున్నాయి.

Poonam Kaur: సిద్దార్థ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. తన మార్క్ కామెంట్.. అంతా గందరగోళం
Poonam Siddharth
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2021 | 2:24 PM

ప్రజంట్ చిత్ర పరిశ్రమలో జరుగుతోన్న పరిణామాలు జనాల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఎవరు.. ఎందుకు రెస్సాండ్ అవుతున్నారో తెలియడం లేదు. సోషల్ మీడియా వేదికగా డైలాగ్స్ పేలుతున్నాయి. తాజాగా హీరో సిద్దార్థ్ వేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. “మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అంటూ ట్వీట్ చేశారు.  అయితే ఈ ట్వీట్ సిద్దార్థ్ ఎవరి గురించి వేశాడా అనేది మాత్రం అంతుబట్టడం లేదు. నెటిజన్లు భిన్న రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. సిద్దార్థ్ ప్రస్తుత పరిణామాల మధ్యే ఎందుకు ఈ ట్వీట్ వేశాడు..? అతడి ఉద్దేశం ఏంటనేది తెలియాల్సి ఉంది.

అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. సిద్దార్థ్ ట్వీట్‌ను హీరోయిన్ పూనమ్ కౌర్ రీ ట్వీట్ చేశారు. ‘అది నిజమే’ అని కామెంట్ పెట్టారు. ఆమె ట్వీట్‌పై కూడా నెటిజన్లు పలు రకాలుగా స్పందనలు తెలియజేస్తున్నారు.

ఇక కంగనా రనౌత్ పెట్టిన పోస్టులు కూడా ప్రకంపనలు రేపుతున్నాయి. నాగ చైతన్య- సమంత దంపతులు విడాకలు విషయాన్ని ఇన్‌డైరెక్ట్ ఆమె అమిర్ ఖాన్‌కు లింక్ చేశారు. కొన్ని రోజుల కిందట ఓ బాలీవుడ్ సూపర్ స్టార్‌ను కలిశాడని, ఆ వెంటనే తన భార్యకు సౌత్ హీరో విడాకులిచ్చాడని కంగనా చేసిన పోస్ట్ హీట్ పుట్టిస్తోంది. ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడంటూ పరోక్షంగా అమీర్ పై సెటైర్లు వేసింది కంగన. పదేళ్లు రిలేషన్ షిప్ లో ఉండి, నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో.. ఓ బాలీవుడ్ స్టార్ సూచనలు-సలహాల మేరకు.. తన భార్యకు విడాకులిచ్చాడంటూ రాసుకొచ్చింది కంగన.

సమాజంలో విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకొచ్చినా అందులో మగాడిదే తప్పంటోంది కంగన. మగాళ్లు వేటగాళ్లుగా, మహిళలు బలిపశువులుగా మారడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చింది. దుస్తులు మార్చినంత ఈజీగా ఆడవాళ్లను మార్చేసే పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది కంగనా.

Kangana

Also Read:  నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌.. నెట్టింట వైరల్

విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత