Bathukamma Song: తెలంగాణ గౌరమ్మ కోసం దిగివస్తున్న సంగీత దిగ్గజాలు. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పాట..
సాధారణంగా దేవుళ్లను, అమ్మవారిని పూవ్వులతో పూజిస్తారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే.. పువ్వులను అమ్మవార్లుగా
సాధారణంగా దేవుళ్లను, అమ్మవారిని పూవ్వులతో పూజిస్తారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే.. పువ్వులను అమ్మవార్లుగా తలచి పూజిస్తుంటారు. మహాలయ అమావాస్య నాడు ప్రారంభించి.. దాదాపు 9 తొమ్మిది రోజులపాటు.. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేరుస్తూ.. ఒక్కో అమ్మవారిగా పూజిస్తుంటారు. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుంచి మొదలు పెట్టి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కో అమ్మవారిని గౌరమ్మగా పూజిస్తుంటారు. తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ. పల్లె నుంచి పట్టణం వరకు తొమ్మిది రోజులపాటు ఘనంగా వేడుకలు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో బతుకమ్మ పాటలు మారుమోగుతున్నాయి. ఏడాది ఏడాది బతుకమ్మ పాటలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బతుకమ్మ పాటపై తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
తెలంగాణ జానపదంగా ఉన్న బతుకమ్మ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మ పాటకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిన సంగతే. అయితే ఈ సంవత్సరం బతుకమ్మ పాట మరింత ఆదరణ పొందనుంది. ఈసారి బతుకమ్మ పాట మరింద ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి బతుకమ్మ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెలుగులో రూపొందించారు. ఈ పాట ప్రముఖ గాయని స్వరంతో ఇప్పటికే సిద్ధం కాగా దానికి ఇటీవల హైదరాబాద్ సమీపంలోని భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరిపారు. ఇదిలా ఉంటే.. ఈసారి రాష్ట్రంలో 6 నుంచి బతుకుమ్మ పండగ ప్రారంభం కానుంది. ఈలోపే ఈ పాటను విడుదల చేయనున్నారు. అలాగే ఈ సాంగ్ ను ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈసారి బతుకమ్మ పాట మరింత ఆదరణ పొందనుంది.
Bigg Boss 5 Telugu: బిగ్బాస్ ట్విస్ట్ మాములుగా లేదు.. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే..