Bheemla Nayak: ఐశ్వర్యా రాజేశ్‌ను రీప్లేస్ చేసిన మలయాళీ ముద్దుగుమ్మ.. భీమ్లా నాయక్‌లో రానా జోడి ఎవరో తెలుసా?
Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానాలు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రాన్ని మలయాళంలో సంచల విజయాన్ని నమోదు చేసిన అయ్యప్పనుమ్ కోషీయమ్‌కు..
Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానాలు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రాన్ని మలయాళంలో సంచల విజయాన్ని నమోదు చేసిన అయ్యప్పనుమ్ కోషీయమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పవన్, రానా వంటి అగ్ర హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అందులోనూ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ తర్వాత వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్లుగానే సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోల ఫస్ట్‌లను విడుదల చేసిన చిత్ర యూనిట్ హీరోయిన్‌లను మాత్రం పరిచయం చేయలేదు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ తర్వాత అందులో నిజం లేదని తెలిసింది.
డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం వల్లే ఐశ్వర్య ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రానాకు జోడిగా మరో మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Also Read: Kondapolam: కొండపొలం నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న దారులు దారులు లిరిక్స్..
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ ట్విస్ట్ మాములుగా లేదు.. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే..