Badvel By Poll Boycott: కడప జిల్లా బద్వేల్ బై ఎలక్షన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు

మీడియా ప్రభావమో.. సోషల్ మీడియా మాధ్యమాల వెసులుబాటో.. ప్రజల్లో మాత్రం చైతన్యం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఏపీలో కడప జిల్లా

Badvel By Poll Boycott: కడప జిల్లా బద్వేల్ బై ఎలక్షన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు
Election Boicott
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 03, 2021 | 11:41 AM

Badvel By Election Boycott: మీడియా ప్రభావమో.. సోషల్ మీడియా మాధ్యమాల వెసులుబాటో.. ప్రజల్లో మాత్రం చైతన్యం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఏపీలో కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలపై వెలుగెత్తుతున్నారు. బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలంలో ఎన్నికల బహిష్కరణ ఫ్లెక్సీలు వెలిశాయి. చిన్నరాజుపల్లె గ్రామ ప్రజలు ఎలక్షన్స్ ను బహిష్కరిస్తున్నట్లు తమ గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

ఎన్నో ఏళ్లుగా రోడ్డు కావాలి మోర్రో అని వేడుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. రోడ్డు మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ గ్రామాల సమస్యల్ని, అభివృద్ధిని పట్టించుకోవడంలేదని గోసపడుతున్నారు.

ఇదిలా ఉండగా, బద్వేల్‌ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. బీజేపీ, జనసేన విభిన్న ప్రకటనలు చేశాయి. తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది జనసేన. కానీ బీజేపీ మాత్రం పోటీకి సై అంటోంది. ఈ ప్రకటనలతో ఆ రెండు పార్టీల మధ్య బంధానికి బీటలు వారుతోందా..? జనసేన, బీజేపీ మధ్య అసలేం జరుగుతోంది..? అన్న డౌట్స్‌ వస్తున్నాయి.

నిన్న బద్వేల్‌ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. సంప్రదాయాన్ని పాటిస్తూ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబసభ్యులకే వైసీపీ టికెట్‌ కేటాయించిన కారణంగా పోటీ చేయడంలేదని వెల్లడించారు.

కానీ బద్వేల్‌లో పోటీకి రెడీ అవుతోంది బీజేపీ. అక్కడి నుంచి పోటీ చేసేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి జనసేన మద్దతిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Read also: Samantha Divorce: కొత్త ఆలోచన రేకెత్తిస్తోన్న సమంత కామెంట్స్.. క్యాస్టింగ్ కౌచ్ మొదలు.. ఫుడ్, సెక్స్ సహా అన్నింటిపై తేల్చేసిన శామ్.!