Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirulina Farming: తక్కువ పెట్టు బడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట స్పిరులినా.. ఎలా పండించాలంటే..

Spirulina Farming: నాచుమొక్కను తినే ఆహారంలో చేర్చుకోమని పోషకార నిపుణులు సలహా కూడా ఇస్తున్నారు. అవును కొన్ని నాచు జాతికి చెందిన మొక్కలు ఔషధగుణాలను కూడా కలిగి..

Spirulina Farming: తక్కువ పెట్టు బడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట స్పిరులినా.. ఎలా పండించాలంటే..
Spirulina Cultivation
Follow us
Surya Kala

|

Updated on: Oct 03, 2021 | 9:57 AM

Spirulina Farming: నాచుమొక్కను తినే ఆహారంలో చేర్చుకోమని పోషకార నిపుణులు సలహా కూడా ఇస్తున్నారు. అవును కొన్ని నాచు జాతికి చెందిన మొక్కలు ఔషధగుణాలను కూడా కలిగి ఉంటాయి. అటువంటి నాచు మొక్కల్లో ఒకటి స్పైరులీనా.. 350 కోట్ల సంవత్సరాల క్రిందటి నీటిమొక్క. దీనిలో వందరకాలకు పైగా విటమిన్లూ, ప్రోటీన్లూ ఇతర పోషకాలూ వున్నాయి. తల్లి పాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ప్రపంచంలోనే స్పైరులీనా అత్యుత్తమ ఆహారం అని ఐక్యరాజ్య సమితి 1975 లోనే చెప్పింది. . వివిధ రూపాల్లో కూడా ఇది లభిస్తుంది. అయితే సముద్రాల్లో లభించే స్పైరులీనా నాచు మొక్కను శాస్త్రీయ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో పెంచుతూ ప్రతి నెల నికర ఆదాయం పొందుతూ మరో కొంతమందికి ఉపాధిని కల్పించవచ్చు.

తల్లిపాలతో పరిపాటిగా చూస్తున్న ఏకైక ఆహారం స్పిరులినా..  ఈ సూపర్ ఫుడ్‌ మన దేశంలో చాలా మందికి తెలియని ఆహారంగా మిగిలిపోతోంది. ఇప్పుడిప్పుడే శాస్త్రీయ పద్ధతుల్లో స్పిరులినాను పెంచేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తున్నారు.

స్పిరులినా పెంపకాన్ని ఎలా ప్రారంభించాలంటే.. 

అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులేమిటి? మదర్ కల్చర్ పై పూర్తిగా అధ్యయనం చేయాలి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది కూలీలు అవసరం లేకుండా స్పిరులినా సాగు చేయవచ్చు అని యువరైతులు నిరూపిస్తున్నారు. ముందుగా పొలంలో పాండ్స్ ను  నిర్మించుకోవాలి. అయితే చెరువులను నిర్మించుకునే ముందు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి లీకేజులు లేకుండా నాణ్యంగా ఉండేందుకు టర్పాలిన్ షీట్‌లను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు సెన్సార్ మోటార్ల ను అమర్చుకుని స్పిరులినా కల్చర్ ను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.

సముద్రంలో పెరిగే నాచును శాస్త్రీయ పద్ధతుల్లో పెంచాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. సముద్రం నీరు ఎలా ఉప్పగా ఉంటుందో.. అదే విధంగా చెరువుల్లో ఉప్పు నీరుని ఏర్పాటు చేసుకోవాలి. కళ్ళ ఉప్పుని కలిపిన నీటితో పాటు.. స్పిరులినా పెరిగేందుకు వంట సోడా, వేప నూనె , సన్‌ఫ్లవర్ నూనెలను ఉపయోగిస్తున్నారు. ఇక నాచు మొక్కల సీడ్ ను చెరువుల్లో వేసిన తర్వాత ఒక 15 రోజుల పాటు అసలు కదిలించకుండా ఉంచాలి. అనంతరం 16 రోజునుంచి ప్రతి రోజూ పంట చేతికి వస్తుంది.

ధర-మార్కెటింగ్ 

ఇక ప్రతి రోజు చేతికి వచ్చే పంటను శాస్త్రీయ పద్దతిలో ఆరబెట్టుకోవాలి. ఇక 100 కేజీ స్పిరులినా  ప్రస్తుత ధర రూ. 45వేలు ధర మార్కెట్ లో ఉంది. ఖర్చులు పోను నికర లాభంగా దాదాపు రూ. 30 వేలు మిగులుతుంది. అంటే వ్యవసాయంలో నష్టంలేని సాగు ఏదైనా ఉందంటే అది స్పిరులినానే అంటున్నారు.

అయితే స్పిరులినా పెంపకంలో మార్కెటింగ్ అనేది పెద్ద ఛాలెంజ్. దీనిని అనేక రకాలైన ట్యాబ్లెట్స్‌లో వాడతారు. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతో మెరుగ్గా పని చేస్తుంది.

ఆసక్తిగలవారికోసం:

ఈ స్పిరులినా పెంపకంలో ఆసక్తి గల వారు  నెల్లూరు జిల్లాకు చెందిన యువరైతు భారత్ ను సంప్రదిస్తే మెలకులను నేర్పుతాను అంటున్నాడు. తాను తక్కువ ఖర్చుతో లాభాలను ఆర్జిస్తున్నట్లు చెబుతున్నాడు.