AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ప్రభుత్వంలోకి టీఎస్ ఆర్టీసీ.. కృతజ్ఞతలు తెలిపిన ఎండీ వీసీ సజ్జనర్‌..

ఖర్చుకు వెనకాడకుండా ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, ఆర్టీసీని బాగుచేయడమే ధ్యేయంగా, ప్రజా రవాణాను బాగుచేయడమే లక్ష్యమని కేబినెట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 43, 373 మంది టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ, అందుకు సంబంధించి నిబంధనలు వర్తింపచేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.

TSRTC: ప్రభుత్వంలోకి  టీఎస్ ఆర్టీసీ.. కృతజ్ఞతలు తెలిపిన ఎండీ వీసీ సజ్జనర్‌..
Tsrtc Md Vc Sajjanar
Venkata Chari
|

Updated on: Aug 01, 2023 | 7:30 AM

Share

Telangana State Road Transport Corporation: ప్రజారవాణా వ్యవస్థను నిర్వహించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన తెలంగాణ ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని బతికించడం, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చిత్తశుద్దితో చేపట్టిందని, అప్పుల్లో కూరుకుపోయినా.. ఎప్పటికప్పుడు ఆర్టీసీని ఆదుకుంటూ, ఉద్యోగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఏడాదికి రూ.1500 కోట్లు ప్రభుత్వమే స్వయంగా బడ్జెట్‌ను అందిస్తోన్న విషయాన్ని కేబినేట్ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ఖర్చుకు వెనకాడకుండా ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, ఆర్టీసీని బాగుచేయడమే ధ్యేయంగా, ప్రజా రవాణాను బాగుచేయడమే లక్ష్యమని కేబినెట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 43, 373 మంది టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ, అందుకు సంబంధించి నిబంధనలు వర్తింపచేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్లర్టు, కింద స్థాయిలో పనిచేసే కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇది. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ గారికి‌ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తూ..’ అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..