Telangana: తెలంగాణలో విస్తృతం కానున్న వైద్య సేవలు.. కొత్తగా అందుబాటులోకి 466 అంబులెన్సులు..
Telangana: సాధారణ అంబులెన్సులు, కాగా మరో 228 అమ్మఒడి రవాణకు వినియోగించనున్నారు. ఇక పార్దివ దేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు 34 అంబులెన్స్ లను కేటాయించారు. అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందనున్నాయి. ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో..

Hyderabad News: తెలంగాణలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కొత్తగా మరికొన్ని అంబులెన్స్ లను ఇవాళ్లి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తం అత్యవసర వైద్య సేవల కోసం కొత్తగా 466 వాహనాలను సమకూరుస్తున్నారు. వాటిలో 204 సాధారణ అంబులెన్సులు, కాగా మరో 228 అమ్మఒడి రవాణకు వినియోగించనున్నారు. ఇక పార్దివ దేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు 34 అంబులెన్స్ లను కేటాయించారు. అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందనున్నాయి. ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అంబులెన్సు వాహనాలను కేసీఆర్ జెండా ఊపి ప్రారంభిస్తారు.
ఇదిలాఉండగా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. కొల్హాపూర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అంబులెన్సు వాహనాలను కేసీఆర్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం సీఎం కొల్హాపూర్ బయలుదేరి వెళ్తారు. అక్కడి మహాలక్ష్మిఅంబా దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. వాటే గావ్‌లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర పర్యటన ముగించుకొని సీఎం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..