Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Maharashtra Tour: ఇవాళ మహారాష్ట్ర కొల్లాపూర్‌కు సీఎం కేసీఆర్.. పక్కా వ్యూహాలతో అడుగులు..

KCR on Kolhapur Sangli Visit: మహారాష్ట్రలో వ్యూహాత్మక దండయాత్ర చేపట్టారు. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా భారీ బలగంతో మరాఠా గడ్డపై అడుగుపెట్టడం.. అక్కడి ఆలయాలను సందర్శించడం.. ప్రముఖ మరాఠ యోదులను, కవులను తమ పార్టీ వైపుకు ఆకర్శించడం.  మిషన్‌ 2024 దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. మహారాష్ట్రపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అక్కడ తమ పార్టీ కార్యకలాపాలను పెంచుకుంటోంది. ఇందులో భాగంగా తానే రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(సీఎం కేసీఆర్) మంగళవారం మహారాష్ట్రలో పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రగతి భవన్ నుంచి నేరుగా..

CM KCR Maharashtra Tour: ఇవాళ మహారాష్ట్ర కొల్లాపూర్‌కు సీఎం కేసీఆర్.. పక్కా వ్యూహాలతో అడుగులు..
CM KCR
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 01, 2023 | 8:14 AM

రాజకీయాల్లో వ్యూహామే ముఖ్యం. స్ట్రాటజీ ఎంత గొప్పగా ఉంటే అంత సక్సెస్‌ సాధ్యం. ఇది సీఎం కేసీఆర్‌కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదేమో. దేశమంతటా బీఆర్ఎస్ విస్తరణే టార్గెట్‌గా పెట్టుకున్న కేసీఆర్..ముందుగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. మహారాష్ట్రలో వ్యూహాత్మక దండయాత్ర చేపట్టారు. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా భారీ బలగంతో మరాఠా గడ్డపై అడుగుపెట్టడం.. అక్కడి ఆలయాలను సందర్శించడం.. ప్రముఖ మరాఠ యోదులను, కవులను తమ పార్టీ వైపుకు ఆకర్శించడం.  మిషన్‌ 2024 దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. మహారాష్ట్రపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ పేరుతో ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ నెమ్మదిగా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్ లోహాలో బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వహించింది. ఆయా సభలకు ప్రజలు పెద్దయెత్తున హాజరుకావడంతో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరింత దూకుడు పెంచారు.

ఇందులో భాగంగా అక్కడ తమ పార్టీ కార్యకలాపాలను పెంచుకుంటోంది. ఇందులో భాగంగా తానే రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(సీఎం కేసీఆర్) మంగళవారం మహారాష్ట్రలో పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రగతి భవన్ నుంచి నేరుగా ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. కొల్లాపూర్‌ విమానాశ్రయానికి 11.15 గంటలకు చేరుకుంటారు. విమనాశ్రయం నుంచి నేరుగా కొల్లాపూర్‌లోని అంబాబాయి దేవాలయానికి చేరుకుంటున్నారు. ఆలయంలో అమ్మవారికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

చంద్రశేఖర్ రావు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 11.15 గంటలకు కొల్హాపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11.45 గంటలకు కొల్హాపూర్‌లోని అంబాబాయి మాతను దర్శనం చేసుకుని, అనంతరం సామాజిక కార్యకర్త, రచయిత అన్నాభౌ సాఠే విగ్రహానికి నివాళులర్పిస్తారు. అలాగే మధ్యాహ్నం 12.45 గంటలకు అన్నాభావు సాఠే వర్ధంతి పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు సంఘ సంస్కర్త కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలుస్తారు. అనంతరం రైతు నాయకుడు రఘునాథ్‌ దాదాపాటిల్‌ నివాసానికి వెళ్లి మధ్యాహ్న భోజన సమావేశానికి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

సాయంత్రం ఐదు గంటలకు కొల్లాపూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అన్నాభావు సాఠే మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సాఠే వర్దంతి కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం