AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆర్డర్ ఎలా రిసీవ్ చేసుకున్నారు.. ఆ కంపెనీకి రూ.30 వేలు ఫైన్.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్, జులై 31: వినియోగదారుల ఫోరం.. ఓ ప్రముఖ కళ్లజోళ్ల సంస్థకు భారీ జరిమానా విధించింది. వినియోగదారుడి ఫిర్యాదుతో ఈ జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ వనస్థలిపురం లెన్స్ కార్ట్‌లో రెండు జతల కళ్ళజోడు ఆర్డర్ పెట్టాడు అబ్బాస్. 2017 డిసెంబర్ 2న వనస్థలిపురం లెన్స్‌కార్ట్ స్టోర్‌కి వెళ్లి ఈ ఆర్డర్ పెట్టాడు. రెండు జతల కళ్ళజోడు కోసం 9520 రూపాయలు చెల్లించాడు. ఆర్డర్ తీసుకున్న యాజమాన్యం..

Sravan Kumar B
| Edited By: |

Updated on: Jul 31, 2023 | 9:53 PM

Share
హైదరాబాద్, జులై 31: వినియోగదారుల ఫోరం.. ఓ ప్రముఖ కళ్లజోళ్ల సంస్థకు భారీ జరిమానా విధించింది. వినియోగదారుడి ఫిర్యాదుతో ఈ జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ వనస్థలిపురం లెన్స్ కార్ట్‌లో రెండు జతల కళ్ళజోడు ఆర్డర్ పెట్టాడు అబ్బాస్. 2017 డిసెంబర్ 2న వనస్థలిపురం లెన్స్‌కార్ట్ స్టోర్‌కి వెళ్లి ఈ ఆర్డర్ పెట్టాడు. రెండు జతల కళ్ళజోడు కోసం 9520 రూపాయలు చెల్లించాడు. ఆర్డర్ తీసుకున్న లెన్స్‌కార్ట్ యాజమాన్యం డిసెంబర్ 19, 2017 లోపు డెలివరీ చేస్తామని రిసిప్ట్ ఇచ్చింది. కానీ, కొన్ని రోజుల తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టు లెన్స్‌కార్ట్ సిబ్బంది అబ్బాస్‌కు తెలియజేశారు.

1 / 5
అసలు దానికి బదులు కొత్త ఆర్డర్ ఏమైనా రిప్లేస్ చేశారా అంటూ లెన్స్‌కార్ట్ సిబ్బందిని అబ్బాస్ అడిగాడు. అయితే, ఇందులో ఎటువంటి కొత్త ఆర్డర్ ప్లేస్ చేయలేదంటూ లెన్స్ కార్డు సిబ్బంది సమాధానం ఇవ్వటంతో కస్టమర్ అవాక్కయ్యాడు. తాను కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరినప్పటికీ లెన్స్‌కార్ట్ యాజమాన్యం సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదని అబ్బాస్ ఫిర్యాదు చేశాడు. పలుమార్లు లెన్స్‌కార్ట్‌కు లీగల్ నోటీసులు పంపినప్పటికీ.. కంపెనీ నుంచి ఎటువంటి స్పందన రాలేదని.. అబ్బాస్ కన్స్యూమర్ ఫోరానికి తెలిపాడు.

2 / 5
కన్జ్యూమర్ ఫోరం నుంచి నోటీసు అందిన తర్వాత లెన్స్‌కార్ట్ ఆప్టికల్ స్టోర్ స్పందించింది. కస్టమర్ చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదని.. ఆర్డర్ పెట్టిన తర్వాత స్టాక్ లేకపోవడంతో వేరే లెన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కస్టమర్‌కు చెప్పినట్టు సమాధానమిచ్చింది. అయితే, లెన్స్‌కార్ట్ ఇచ్చిన రిప్లైపై కస్టమర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తన కుమారుడు కళ్ళజోడు లేక కొన్ని నెలలపాటు ఇబ్బంది పడ్డాడని వినియోగదారుల ఫోరానికి విన్నవించారు.

3 / 5
దీంతో లెన్స్‌కార్ట్ యాజమాన్యానికి కన్జ్యూమర్ ఫోరం ఫైన్ విధించింది. బాధితుడికి 30 వేల పరిహారం చెల్లించటంతో పాటు 5,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని ఆదేశించింది. ఆర్డర్ స్వీకరించే సమయంలోనే మెటీరియల్ ఉందో లేదో చూసుకోకుండా ఆర్డర్ ఎలా రిసీవ్ చేసుకున్నారంటూ లెన్స్‌కార్ట్‌పై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కన్స్యూమర్ ఫోరం చట్టంలో ఖచ్చితమైన నిర్దేశత్వాలు ఉన్నాయి. కానీ చాలామంది వినియోగదారులకు వాటి మీద అవగాహన లేకపోవడంతో.. హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు.

4 / 5
వ్యాపారం, బ్యాంకింగ్, హాస్పిటల్, మెడికల్ ఇలా ప్రతి సెక్టార్లో కస్టమర్ల హక్కులకు భంగం కలిగితే వినియోగదారుల ఫోరం ను సంప్రదించి న్యాయం పొందవచ్చు. మీకూ ఇలాంటి సమస్యలు ఎదురైతే మీరూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడం మరువకండి.. అందుకే.. హక్కుల గురించి తెలుసుకోవాలని కోరుతున్నాం..

5 / 5