TG సిరీస్‌కు మంచి గిరాకీ.. 09 9999 నంబర్ ప్లేట్ వేలం.. ధర చూస్తే మైండ్ బ్లోయింగ్..
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నంబర్లకు గిరాకీ భారీగా పెరిగింది. కేవలం ఒక్క వాహనం రిజిస్ట్రేషన్ కోసం లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు నగరవాసులు. దీంతో కొత్త సిరీస్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ను వేలం నిర్వహించారు రవాణా శాఖ అధికారులు. ఇందులో చాలా మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపార వేత్తలు, సినీ రాజకీయ ప్రముఖులు ఇలా చాలా మంది సుసంపన్నులు నివసిస్తున్నారు.
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నంబర్లకు గిరాకీ భారీగా పెరిగింది. కేవలం ఒక్క వాహనం రిజిస్ట్రేషన్ కోసం లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు నగరవాసులు. దీంతో కొత్త సిరీస్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ను వేలం నిర్వహించారు రవాణా శాఖ అధికారులు. ఇందులో చాలా మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపార వేత్తలు, సినీ రాజకీయ ప్రముఖులు ఇలా చాలా మంది సుసంపన్నులు నివసిస్తున్నారు. తాజాగా ఆర్టీవో ఆఫీస్ ఆన్లైన్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ వేలంలో ఒక ఫ్యాన్సీ నంబర్‌ను ప్రముఖ సోనీ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఓ)లో నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ధర అక్షరాలా రూ. 25.5 కు విక్రయించబడింది. “TG 09 9999” నంబర్ ప్లేట్‌ను సోనీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ అనే సంస్థ రూ. 25,50,002 భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసింది. కంపెనీ యాజమాన్యంలోని టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనం కోసం ఈ నంబర్ ప్లేట్ ఉపయోగించనున్నారు.
కొత్త శ్రేణి నంబర్‌లను వేలం వేసిన ఒక్క రోజులో రవాణా శాఖ ద్వారా మొత్తం రూ.43,70,284 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మార్చి నుంచి నగరంలో ఫ్యాన్సీ టీజీ నంబర్ ప్లేట్ల వేలం ప్రారంభం కావడంతో ఇప్పటి వరకు ఆర్టీఏ శాఖకు కేవలం ఇలాంటి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ల వల్ల రూ.30 లక్షలు ఆదాయం వచ్చిపడింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘TS’ నుండి ‘TG’ గా మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తరువాత, తెలంగాణ పాత వాహనాల నంబర్ ప్లేట్‌లకు అప్‌డేట్ అవసరమా అనే దానిపై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాహన యజమానులు TG నంబర్ ప్లేట్‌ను పొందుతున్నారు. అయితే ఇప్పటికే రిజిస్టర్ అయిన వాహనాల నంబర్ ప్లేట్లను మార్చాల్సిన పనిలేదని స్పష్టం చేసింది రవాణా శాఖ. మొట్ట మొదటి TG సీరీస్లోని నంబర్ ప్లేట్, TG 09 0001 వేలం వేయగా రూ. 9.61 లక్షలకు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..