Telangana Government: విరించి ఆస్పత్రికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్.. కోవిడ్ లైసెన్స్ రద్దు.. ఉత్తర్వులు జారీ..
Telangana Government: విరించి ఆస్పత్రికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ షాక్ ఇచ్చింది. ఆస్పత్రి కోవిడ్ లైసెన్స్‌ని రద్దు చేసింది. ఈ మేరకు...
Telangana Government: విరించి ఆస్పత్రికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ షాక్ ఇచ్చింది. ఆస్పత్రి కోవిడ్ లైసెన్స్‌ని రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు ప్రకటన జారీ చేశారు. కోవిడ్ పేషెంట్ల నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా చికిత్స సరైన విధానం అనుసరించడం లేదని విరించి ఆస్పత్రిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తికి కరోనా సోకడంతో అతని కుటుంబ సభ్యులు విరించి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, పరిస్థితి విషమించి అతను ప్రాణాలు కోల్పోయాడు. పైగా రూ. 20 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో ఆగ్రహించిన వంశీకృష్ణ కుటుంబ సభ్యులు.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.
మృతుడి బంధువులలో కూడా వైద్యులు ఉండటంతో చికిత్సపై ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. దాంతో డబ్బులు కట్టొద్దని, మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వంశీకృష్ణ చనిపోయాడని, ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించలేదని మృతుడి బంధువులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పైగా భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో విరించి ఆస్పత్రికి రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై విరించి ఆస్పత్రి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కోవిడ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. దీనికి సంబంధించిన నోటీసులను కూడా ఆస్పత్రికి పంపించారు.
ఇదిలాఉంటే.. కరోనా సంక్షోభాన్ని లాభదాయకంగా మార్చుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులపై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఫిర్యాదులు అందిన ఆస్పత్రులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇప్పటి వరకు 66 ఆస్పత్రులపై 88 ఫిర్యాదు అందినట్లు ప్రభుత్వ వైద్యాధికారులు తెలిపారు. ఈ ఆస్పత్రులన్నింటికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Also read: