Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా 3,527 కేసులు నమోదు..

Telangana Corona Updates: తెలంగాణ కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. లాక్‌డౌన్ విధించినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా..

Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా 3,527 కేసులు నమోదు..
Follow us

|

Updated on: May 28, 2021 | 8:26 PM

Telangana Corona Updates: తెలంగాణ కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. లాక్‌డౌన్ విధించినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 97,236 మంది నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా.. వారిలో 3,527 కొత్త పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా బారిన పడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గణాంకాలతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారిక సంఖ్య 5,30,025 లకు చేరింది. ఇక కరోనా వైరస్ సోకి రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 3,226 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మరణాల రేటు 0.56 శాతం ఉండగా.. రికవరీ రేటు 92.81 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇక తాజాగా నమోదైన పాజిటీవ్ కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 519 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఆదిలాబాద్ – 18, బద్రాద్రి కొత్తగూడెం – 154, జగిత్యాల – 55, జనగామ – 31, జయశంకర్ భూపాలపల్లి – 48, జోగులాంబ గద్వాల – 54, కామారెడ్డి – 20, కరీంనగర్ – 178, ఖమ్మం – 215, కొమరంభీం ఆసిఫాబాద్ – 23, మహబూబ్‌నగర్ – 124, మహబూబాబాద్ – 119, మంచిర్యాల – 88, మెదక్ – 40, మేడ్చల్ మల్కాజిగిరి – 188, ములుగు – 46, నాగర్ కర్నూల్ – 81, నల్లగొండ – 218, నారాయణ పేట – 26, నిర్మల్ – 15, నిజామాబాద్ – 47, పెద్దపల్లి – 144, రాజన్న సరిసిల్ల – 78, రంగారెడ్డి – 207, సంగారెడ్డి – 75, సిద్ధిపేట – 115, సూర్యాపేట – 152, వికారాబాద్ – 83, వనపర్తి – 95, వరంగల్ రూరల్ – 96, వరంగల్ అర్బన్ – 130, యాదాద్రి భువనగిరి – 45 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read: Earth: భూమిలోపలకు ఎంత లోతువరకూ బిలం తవ్వగలమో తెలుసా? ఇంతవరకూ ఈలోతు దాటి ఎవరూ పోలేదు!

NTR Jayanthi: అన్న‌గారికి బాల‌య్య ఘ‌న‌నివాళి.. పెద్దాయ‌నపై చినతార‌క‌రాముడి భావోద్వేగ పోస్ట్ వైర‌ల్

Akkineni Nagarjuna: ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున.. సినిమాకోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్..