NTR Jayanthi: అన్న‌గారికి బాల‌య్య ఘ‌న‌నివాళి.. పెద్దాయ‌నపై చినతార‌క‌రాముడి భావోద్వేగ పోస్ట్ వైర‌ల్

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 99 వ జయంతి ఉత్సవాలను శుక్ర‌వారం బసవతారకం....

NTR Jayanthi: అన్న‌గారికి బాల‌య్య ఘ‌న‌నివాళి.. పెద్దాయ‌నపై చినతార‌క‌రాముడి భావోద్వేగ పోస్ట్ వైర‌ల్
Ntr
Follow us
Ram Naramaneni

|

Updated on: May 28, 2021 | 8:07 PM

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 99 వ జయంతి ఉత్సవాలను శుక్ర‌వారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఘనంగా నిర్వహించారు. లక్షలాది క్యాన్సర్ రోగులకు ఆశాకిరణంగా నిల్చిన సంస్థ వ్యవస్థాపకులు కూడా అయిన శ్రీ ఎన్టీఆర్ గారి జన్మదినోత్సవ వేడుకలలో ఆస్ప‌త్రి ఛైర్మ‌న్ శ్రీ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారుముందుగా సంస్థ ఆవరణలో ఉన్న స్వర్గీయ నందమూరి బసవతారక రామారావు గార్ల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించిన శ్రీ నందమూరి బాలకృష్ణ అనంతరం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్లతో ముచ్చటించిన శ్రీ నందమూరి బాలకృష్ణ వారి బాగోగులకు అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స అందుబాటైన ధరలలో పేదలకు కూడా అందించాలనే లక్ష్యంతో స్వర్గీయ యన్ టి ఆర్ స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో ఎన్నో మైలు రాయిలకు అధిగమించి సంస్థ ముందుకు వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్ స్థాపించడంలో స్వర్గీయ ఎన్టీఆర్ పోషించిన పాత్ర, ఆయన దూరదృష్టి నేడు దేశంలోనే అగ్రగామి క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా ఎదిగిందని అన్నారు. అంతకు ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీరంగంలో పని చేసిన తీరు, ఆ సందర్భంగా అందరినీ కలుపుకొని ప్రకృతి వైపరీత్యాలు, ఆపదలు తలెత్తిన సమయాలలో తెలుగురాష్ట్రాల ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకొన్నారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి, వారిని భాగస్వాములుగా చేసి తెలుగుదేశం పార్టీ నెలకొల్పి పేదల కోసం ఎన్నో మంచి పనులు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుకు ద‌క్కుతుందన్నారు.

విశ్వవిఖ్యాత, నటసౌర్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్​ ఆయన్ని స్మరించుకున్నారు. సోష‌ల్ మీడియాలో భావోద్వేగ పోస్టుతో నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ట్వీట్…

“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఓ సందేశాన్ని షేర్ చేశారు తారక్.

Also Read:  బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ

ఏపీలో మ‌రో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు !

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే