KTR Tweet: బిర్యానీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజన్.. మంత్రి రిప్లై భలే ఫన్నీ
తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. అటు ప్రజాక్షేత్రంలో జనాలు అందుబాటులో ఉండటంతో....
తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. అటు ప్రజాక్షేత్రంలో జనాలు అందుబాటులో ఉండటంతో పాటు ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా ఆపదలో లేదా ఏదైనా సమస్య ఉండి ట్విట్టర్ ద్వారా సాయం అర్థిస్తే.. వారికి అండగా నిలబడతారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో ఇంట్రాక్ట్ అవుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుత కరోనా సమయంలో తమ ఇబ్బందులను ఏకరవు పెడుతూ చాలామంది ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ను అప్రోచ్ అవుతున్నారు. వారిలో చాలామందికి కేసీఆర్ సమాధానాలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ నెటిజన్ కేటీఆర్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసిన విధానం ఆశ్చర్యపరిచింది. తనకు బిర్యానీ ఆర్డర్ సరిగా ఇవ్వలేదంటూ అతడు ఓ ఫుడ్ డెలివరీ సంస్థతో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ట్యాగ్ చేశాడు. దీనికి మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆన్సర్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి.. అసలు అతడు ఏమని ట్వీట్ చేశాడు. కేటీఆర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
‘నేను చికెన్ బిర్యానీ, ఎక్స్‌ట్రా మసాలా, లెగ్ పీస్ కావాలంటూ ఆర్డర్ చేశాను. కానీ వాటిలో ఏమీ రాలేదు. జనాలకు సేవ చేసే విధానం ఇదేనా’ అంటూ అతడు కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు
And why am I tagged on this brother? What did you expect me to do ?? https://t.co/i7VrlLRtpV
— KTR (@KTRTRS) May 28, 2021
‘దీనికి నన్ను ఎందుకు ట్యాగ్ చేశావు బ్రదర్. ఈ విషయంలో మీరు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు’ అని కేటీఆర్ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Also Read: లాక్‌డౌన్‌పై ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఫోన్.. తదుపరి నిర్ణయంపై సంకేతాలు ఇలా!
ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందా…? ఇదిగో క్లారిటీ
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!