AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: లాక్‌డౌన్‌పై ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఫోన్.. త‌దుప‌రి నిర్ణ‌యంపై సంకేతాలు ఇలా!

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిణామాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. ఈ నెల 30న కేబినెట్ మీటింగ్ ఉన్న నేప‌థ్య‌లో  రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు....

CM KCR: లాక్‌డౌన్‌పై ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఫోన్.. త‌దుప‌రి నిర్ణ‌యంపై సంకేతాలు ఇలా!
Telangana Cm Kcr
Ram Naramaneni
|

Updated on: May 28, 2021 | 6:32 PM

Share

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిణామాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. ఈ నెల 30న కేబినెట్ మీటింగ్ ఉన్న నేప‌థ్య‌లో  రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలతో పాటు స్థానిక ప‌రిస్థితులు తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ ఎలాంటి ఫలితాల‌ను ఇస్తుంది? వివిధ వర్గాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఆంక్షలు, సడలింపులపై వారి వెర్ష‌న్ ఎలా ఉంది? పోలీసుల పనితీరు ఎలా ఉంది? తదితర వివరాలను ముఖ్య‌మంత్రి అడిగారని తెలిసింది. క‌రోనా వ్యాప్తి కట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా మే 12 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అదే రోజు కేబినెట్ మీటింగ్ నిర్వ‌హించాల‌ని సీఎం నిర్ణయించారు. ఎజెండాలో లాక్‌డౌన్‌ కీలకం కావడంతో దాని గురించి మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌,  ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి సమాచారం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగించాలా? ఆంక్షలేమైనా తొలగించాలా? ఇతర నిర్ణయాలపై సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో వానాకాలం పంటల సీజన్‌తో పాటు ప్రజలకు, సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేష‌న్ కార్యక్రమం మొదలవుతున్నందున లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయం కీలకమని, ప్రజల మనోభావాల మేరకే ముందుకుసాగుదామని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ వర్గాలను రంగంలోకి దింపిన‌ట్లు తెలుస్తోంది.

Follow Us
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి