Lock Down: జూన్ 30 వరకు లాక్‌డౌన్ ఉంటుందా..? అనుమానాలు రేకెత్తిస్తోన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు..
Lock Down: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గతేడాదిని మించి కేసులు నమోదు కావడంతో కరోనా మరింత తీవ్ర రూపాన్ని దాల్చింది. ఒకానొక సమయంలో ఏకంగా మూడున్నర లక్షల..
Lock Down: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గతేడాదిని మించి కేసులు నమోదు కావడంతో కరోనా మరింత తీవ్ర రూపాన్ని దాల్చింది. ఒకానొక సమయంలో ఏకంగా మూడున్నర లక్షల కేసులు నమోదుకావడంతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయా.? అన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నమరణాలు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో పరిస్థితులు మళ్లీ కుదుటపడుతున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం లాక్‌డౌన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇక తెలంగాణలో ఈ నెల చివరితో లాక్‌డౌన్ ముగుస్తున్ననేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి లాక్‌డౌన్ సమయం పెరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా లాక్‌డౌన్‌పై స్పందించిన కిషన్ రెడ్డి.. కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు జూన్ 30 వరకు లాక్‌డౌన్ విధించేందుకు అనుమతి ఇచ్చిందని చెప్పిన మంత్రి.. లాక్‌డౌన్ పెట్టుకోవాలా? వద్దా.? అన్నది ఆయా రాష్ట్రాల ఇష్టమని చెప్పుకొచ్చారు. దీంతో తెలంగాణలో లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో లాక్‌డౌన్ మరోసారి పొడగిస్తున్నారా.. అన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది.