Food For Stress Free: కరోనా వేళ ఒత్తిడితో చిత్తవుతున్నారా.? ఈ ఫుడ్‌ను ట్రై చేయండి.. రిలాక్స్ అవ్వండి..
Food For Stress Free: కరోనా మహమ్మారి మనుషుల శారీరక ఆరోగ్యాలతో పాటు మానసిక ఆరోగ్యాలతో సైతం ఆడుకుంటోంది. కరోనా కారణంగా చనిపోతున్నారు, లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ఇలాంటి వార్తలు తీవ్ర...
Food For Stress Free: కరోనా మహమ్మారి మనుషుల శారీరక ఆరోగ్యాలతో పాటు మానసిక ఆరోగ్యాలతో సైతం ఆడుకుంటోంది. కరోనా కారణంగా చనిపోతున్నారు, లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ఇలాంటి వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సోకని వారు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం కూడా మనిషి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మరి మనం తీసుకునే ఆహారం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే విషయం మీకు తెలుసా.? ఒత్తిడిని చిత్తు చేసే ఆహార పదార్థాలపై ఓ లుక్కేయండి..
* ఒత్తిడిని చిత్తు చేయడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బాదం పప్పు, జీడి పప్పు, వేరు శెనగలు, వాల్‌నట్స్ వంటివి మెదుడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.
* ఒత్తిడిని చిత్తు చేయడంలో బెర్రీ పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీలలో ఉండే ఆంథో సయనిన్లు ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.
* చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సైతం మానసిక ఆందోళనను దూరం చేస్తాయి. కాబట్టి చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి.. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది చాలా అవసరం.
* పాలకూరలో ఉండే మెగ్నిషియం సెరొటోనిన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. సెరొటోనిన్ ఉత్పత్తి మనుషుల మూడ్‌ను మారుస్తుంది. కాబట్టి డిప్రెషన్, ఒత్తిడితో సతమతమయ్యే వారు పాలకూరను నిత్యం తీసుకుంటూ ఉండాలి.
* ఒత్తిడిని తగ్గించడంతో డార్క్ చాక్లెట్లు కీలకపాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది.
Coronavirus: కోవిడ్ సోకిన వారు నిరంతరం ఆ రెండు జాగ్రత్తలు పాటిస్తే చాలు మరణం నుంచి రక్షణ పొందవచ్చు..
Do Not Eat These Foods : పడుకునే ముందు ఈ ఐదు ఆహారాలు అస్సలు తినొద్దు..! ఆరోగ్యానికి చాలా ముప్పు..?