Warts Remove Tips: పులిపిరి సమస్యతో సతమతమవుతున్నారా.? సహజ పద్ధతులతో ఇలా తగ్గించుకోండి..
Warts Remove Tips: పులిపిరి.. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అందంగా ఉన్న మొహంపై పెద్ద పరిమాణంలో ఉండే మెటిమలాగా కనిపించే ఈ పులిపిర్లను అందాన్ని పాడు చేస్తుంటాయి. చర్మం కింద...
Warts Remove Tips: పులిపిరి.. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అందంగా ఉన్న మొహంపై పెద్ద పరిమాణంలో ఉండే మెటిమలాగా కనిపించే ఈ పులిపిర్లను అందాన్ని పాడు చేస్తుంటాయి. చర్మం కింద మందంగా ఉన్న భాగాల్లో కొల్లాజెన్ ఫైబర్స్ పేరుకుపోవడం వల్ల పులిపిరికాయలు ఏర్పడుతాయి. ముఖ్యంగా వంశపారపర్యంగా ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. చర్మ సంబంధిత వైద్యులు ఈ పులిపిర్లను తొలగిస్తుంటారు. అయితే డాక్టర్ వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే.. సహజ పద్ధతులతో పులిపిర్లను తొలిగించుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూడండి..
* అరటి తొక్కతో పులిపిర్లు తొలిగిపోతాయి. అరటి పండ్ల తొక్కలో ఉండే యాంటీ ఏజింగ్ సమ్మేళనాలు పులిపిర్లను తొలగించడంలో ఉపయోగపడతాయి. తొక్కను పులిపిరి ఉన్న చోట వేసి పట్టీ లేదా బ్యాండేజ్ వేయాలి రాత్రంతా ఇలా ఉంచితే పులిపిరి తొలగిపోతుంది.
* విటమిన్ ఇ ఆయిల్‌తో రోజూ పులిపిర్లు ఉన్న చోట్ల మసాజ్‌లాగా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని రోజుల్లో పులిపిరి సమస్య తొలగిపోతుంది.
* వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం దానిని రోజూ పులిపిరులున్న చోట అప్లై చేసుకుంటే పులిపిరిలు తగ్గిపోతాయి.
* వెల్లుల్లిలాగే అల్లంతో కూడా పులిపిర్లను తగ్గించుకోవచ్చు. అల్లంముక్కను తీసుకుని నూరి మిశ్రమంగా చేసి దాన్ని పులిపిరిలపై అప్లై చేయాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.
గమనిక: కళ్లపై పులిపిరిలు ఉంటే మాత్రం పైన తెలిపిన చిట్కాలను ఉపయోగించకోపవడమే మంచిది. కంటిలాంటి సున్నిత ప్రదేశాల్లో పులిపిర్లు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Also Read: కల్లు కోసం మొండికేసిన కోవిడ్ బాధితుడు.. రెండు లీటర్లు తాగించి ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు
Bat in Plane: అమెరికా వెళుతున్న విమానంలో గబ్బిలం..తిరిగి ఢిల్లీ చేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్!