కల్లు కోసం మొండికేసిన కోవిడ్ బాధితుడు.. రెండు లీటర్లు తాగించి ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు

చికిత్స కన్నా.. తనకు కల్లే ముఖ్యమని కోవిడ్ బాధితుడు చెప్పడంతో ఆశ్చర్య పోవడం పోలీసుల వంతైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది.

కల్లు కోసం మొండికేసిన కోవిడ్ బాధితుడు.. రెండు లీటర్లు తాగించి ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు
Kallu
Follow us
Sanjay Kasula

|

Updated on: May 28, 2021 | 9:57 PM

కల్లు కోసం కోవిడ్ బాధితుడు ఆస్పత్రి నుంచి పారిపోయాడు. దీంతో కోవిడ్ వైద్య సిబ్బందిని, పోలీసులను పరుగులు హడలి పోయారు. రోజంతా గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తాను కల్లు లేనిదే బతకలేనని, చికిత్స కన్నా.. తనకు కల్లే ముఖ్యమని కోవిడ్ బాధితుడు చెప్పడంతో ఆశ్చర్య పోవడం పోలీసుల వంతైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. పిట్లం మండలం తిమ్మానగర్‌ గ్రామానికి చెందిన 55 సంవత్సరాల కరోనా బాధితుడు కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న బాధితుడు బుధవారం ఉదయం ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయాడు.

కోవిడ్ వార్డ్ వార్డులో బాధితులను పరీక్షిస్తున్న డాక్టర్‌కు ఓ బాధితుడు కనిపించకుండా పోవడంతో  అవాక్కయ్యారు. వెంటనే స్థానిక పోలీసులు, మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ప్రభుత్వ సిబ్బంది పట్టణంను జల్లడ పట్టారు. చివరికి సంగమేశ్వర కాలనీలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద దిగాలుగా  కూర్చొని కనిపించాడు.

ఆస్పత్రి నుంచి ఎందుకు పారిపోయావని అడగటంతో అసలు సంగతి బయట పడింది. తాను కల్లు లేనిదే ఉండలేనని చెప్పాడు. దీంతో పోలీసులు రెండు లీటర్ల కల్లు తెప్పించి ఇచ్చారు. అది తాగిన తర్వాత అతడిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అప్పటి వరకు   ఆస్పత్రికి రానంటూ మొండికేశాడని పోలీసులు తెలిపారు.

Cyclones: ఏభై ఏళ్లలో 171 తుపానులు..అతి పెద్ద సైక్లోన్లు బంగాళాఖాతంలోనే..ఈ విపత్తులలో నష్టం ఎంతంటే..

KTR Tweet: బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే