Secunderabad Army School Jobs: సికింద్రాబాద్ ఆర్మీ స్కూల్‌లో టీచ‌ర్ ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులంటే..

Secunderabad Army School Jobs: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. వివిధ స‌బ్జెక్టుల్లో బోధ‌న అనుభ‌వం ఉన్న వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుకోవ‌చ్చు. 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి...

Secunderabad Army School Jobs: సికింద్రాబాద్ ఆర్మీ స్కూల్‌లో టీచ‌ర్ ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులంటే..
Teacher Posts In Army School
Follow us
Narender Vaitla

|

Updated on: May 28, 2021 | 10:01 PM

Secunderabad Army School Jobs: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. వివిధ స‌బ్జెక్టుల్లో బోధ‌న అనుభ‌వం ఉన్న వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుకోవ‌చ్చు. 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ఈ ఉద్యోగాల‌ను తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 21 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)–06, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)–05, ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ)–10 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్ స‌బ్జెక్ట్‌ల‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) టీచ‌ర్ల‌ను తీసుకోనున్నారు. అభ్య‌ర్థులు కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ చేసి ఉండాలి. సీబీఎస్‌ఈ ఇంటర్మీడియట్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు బోధించిన అనుభ‌వం ఉండాలి.

* ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోతరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.

* ప్రైమరీ టీచర్స్‌(పీఆర్‌టీ) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ/డీఈడీ చేసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాలతో కూడిన ద‌ర‌ఖాస్తును ఆర్‌కే పురం ఫ్లైఓవ‌ర్‌, సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 10-06-2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Bat in Plane: అమెరికా వెళుతున్న విమానంలో గబ్బిలం..తిరిగి ఢిల్లీ చేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్!

KTR : వేములవాడలో 22 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

power grid recruitment: ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్‌లో డిప్లొమా ట్రెయినీ పోస్టులు.. ఎల‌క్ట్రిక‌ల్‌, సివిల్ విభాగాల్లో..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?