Bat in Plane: అమెరికా వెళుతున్న విమానంలో గబ్బిలం..తిరిగి ఢిల్లీ చేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్!
Bat in Plane: ఢిల్లీ నుంచి అమెరికా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం విమానంలో గబ్బిలం కనిపించడమే. వివరాలు ఇలా ఉన్నాయి.
Bat in Plane: ఢిల్లీ నుంచి అమెరికా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం విమానంలో గబ్బిలం కనిపించడమే. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ ఎఐ-105 శుక్రవారం తెల్లవారుజామున 2.20 గంటలకు ఢిల్లీ నుంచి నెవార్క్ (న్యూజెర్సీ) కు బయలుదేరింది. టేకాఫ్ అయిన 30 నిమిషాల తరువాత, ప్రయాణీకుల ప్రాంతంలో గబ్బిలాలు కనిపించాయి.దీంతో విమానం తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చారు.అక్కడ తెల్లవారుజామున 3.55 గంటలకు విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీని తరువాత, అటవీ శాఖ సిబ్బంది చనిపోయిన గబ్బిలాలను దాని నుండి బయటకు తీశారు.
ఫ్లైట్ బయలుదేరిన అరగంట తరువాత, పైలట్ విమానంలోని గబ్బిలాల గురించి ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణకు సమాచారం ఇచ్చారు. దీని తరువాత, అత్యవసర డిక్లేర్ ద్వారా విమానాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు. విమానాశ్రయం సిబ్బంది విమానం దిగిన తరువాత శోధించినప్పుడు, గబ్బిలాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో వన్యప్రాణి నిపుణులను పిలిచారు. వారు విమానంలో పొగ వేశారు. తరువాత గబ్బిలాలు విమానంలో దొరికాయి. అయితే, అప్పటికి అవి చనిపోయాయి.
ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఆదేశించింది. సంఘటనపై ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, “ఎయిర్ ఇండియాకు చెందిన బి777-300ఈఆర్ విమానం ఢిల్లీ-నెవార్క్ మధ్య సేవ కోసం ఉపయోగిస్తున్నారు. దీని రిజిస్ట్రేషన్ నంబర్ వీటీ ఎల్ఎం. సాధారణంగా ప్రతి విమానాన్నీ ప్రయాణానికి ముందు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తరువాతే క్లియరెన్స్ ఇస్తారు. కానీ, ఈ ఘటనలో గ్రౌండ్ సర్వీస్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా వెలుగులోకి వచ్చింది.