AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gunfire : ఆక్రమణలను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే.. ఆకస్మాత్తుగా కాల్పుల మోత.. భయంతో పరుగులు..

Gunfire : ఆక్రమణలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే, అధికారులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఎమ్మెల్యే, ఆయన భద్రతా సిబ్బంది,

Gunfire : ఆక్రమణలను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే.. ఆకస్మాత్తుగా కాల్పుల మోత.. భయంతో పరుగులు..
Gun Fire
Shiva Prajapati
|

Updated on: May 28, 2021 | 10:03 PM

Share

Gunfire : ఆక్రమణలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే, అధికారులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఎమ్మెల్యే, ఆయన భద్రతా సిబ్బంది, అధికారులు అక్కడినుంచి పరుగులు తీసి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ భయానక ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. మరియాని నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా అధికారులతో కలిసి అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వెంబడి జోర్హాట్ జిల్లాలోని డెస్సోయి వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఆక్రమణలను తనఖీ చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ ఊహించని విధంగా తుపాకుల మోత మోగింది. దుండుగులు వీరిపై కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయిన ఎమ్మెల్యే, అధికారులు, ఇతరులు అక్కడి నుంచి పరులుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే, ఈ కాల్పుల్లో ముగ్గురు జర్నలిస్టులకు గాయాలైనట్లు జోర్హాట్ జిల్లా పోలీసు అధికారి తెలిపారు.

అస్సాం రాష్ట్రంలోని ఐదు జిల్లాలు నాగాలాండ్‌తో అంతర్రాష్ట్ర సరిహద్దును పంచుకుంటున్నాయి. చరైడియో, శివసాగర్, జోర్హాట్, గోలఘాట్, కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలకు నాగాలాండ్ సరిహద్దుగా ఉంది. అయితే, నాగాలాండ్ వైపు నుండి ఆక్రమణలు ఎక్కువగా ఉండటంతో గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో తరచూ వాగ్వివాదాలను చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఎమ్మెల్యే పర్యటించిన ప్రాంతం వివాదాస్పద ప్రాంతం. కొద్ది రోజుల క్రితమే అటవీ శాఖ అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఇప్పుడు ఎమ్మెల్యే, అధికారులు పర్యటించడంతో రాష్ట్ర సరిహద్దుకు అవతలి గ్రామస్తులు భయపడి కాల్పులు జరిపారు. అయితే, భద్రతా దళాలు వారిని ధీటుగా సమాధానం చెప్పాయి.’’ అని జిల్లా పోలీసు అధికారి అంకుర్ జైన్ తెలిపారు.

‘‘సరిహద్దుల్లో నాగాలాండ్ వాసుల ఆక్రమణలకు సంబంధించి పూర్తి నివేదికలు నా వద్ద ఉన్నాయి. వాటిని ఆధారంగానే ఇవాళ నేను డెస్సోయ్ వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్‌కు వెళ్లాను. అకస్మాత్తుగా కొంతమంది మాపై కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు మేం ఆ ప్రదేశం నుంచి తప్పించుకున్నాం. ఈ వివాదంపై ఇప్పటికే నేను అసెంబ్లీలో అనేకసార్లు ప్రస్తావించాను. కానీ, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నాగాలాండ్‌తో చర్చలు జరపడం లేదు.’’ అని ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి ఆరోపించారు.

ఇదిలాఉండగా.. ఈ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అస్సాం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

Also read:

GST council Meeting : జీఎస్టీ మండలిలో కుదరని ఏకాభిప్రాయం.. పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు