AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council meet: కుదరని ఏకాభిప్రాయం… పన్నురేట్ల అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం

GST Council: కరోనా మెడిసిన్, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న టాక్స్‌ అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే...

GST Council meet: కుదరని ఏకాభిప్రాయం... పన్నురేట్ల అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం
Gst Council Meet
Sanjay Kasula
|

Updated on: May 28, 2021 | 10:20 PM

Share

అనున్నట్లే జరిగింది. ఏకాభిప్రాయం కుదరకుండానే ముగిసింది. కోవిడ్ మెడిసిన్, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న టాక్స్‌ అంశంపై జీఎస్టీ మండలి ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే క్లోజ్ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. ఈ ఏడాదిలో జరిగిన మొదటి సమావేశం జనం అనుకున్నది ఇవ్వకుండానే ముగిసింది.  సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడుతూ…  ఈ భేటీలో ముఖ్యంగా కరోనా సంబంధిత వస్తువులపై పన్ను అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి  వెల్లడించారు.

పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. అయితే విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం లేదా ఏజెన్సీలకు వచ్చే వైద్య పరిరకాలపై మినహాయింపును ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. అలాగే, మినహాయింపు జాబితాలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిస్‌-బి ఔషధాన్ని చేర్చినట్లు వివరించారు.

Wrestlers: రెజ్లింగ్ కవచంలో చీకటి సామ్రాజ్యాలు..ఆటగాళ్ళ ముసుగులో విషపు పురుగులు!

Gunfire : ఆక్రమణలను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే.. ఆకస్మాత్తుగా కాల్పుల మోత.. భయంతో పరుగులు..