AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కోవిడ్ సోకిన వారు నిరంతరం ఆ రెండు జాగ్రత్తలు పాటిస్తే చాలు మరణం నుంచి రక్షణ పొందవచ్చు..

Coronavirus: కరోనా మహమ్మారి మొదటి సారి చేసిన దాడి కంటె, రెండోసారి చేస్తున్న దాడిలో తీవ్రత ఎక్కువ ఉంది. దీంతో మరణాల సంఖ్యా ఎక్కువగా ఉంది. అయితే, మరణాల సంఖ్యను తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Coronavirus: కోవిడ్ సోకిన వారు నిరంతరం ఆ రెండు జాగ్రత్తలు పాటిస్తే చాలు మరణం నుంచి రక్షణ పొందవచ్చు..
Coronavirus
KVD Varma
|

Updated on: May 28, 2021 | 2:58 PM

Share

Coronavirus: కరోనా మహమ్మారి మొదటి సారి చేసిన దాడి కంటె, రెండోసారి చేస్తున్న దాడిలో తీవ్రత ఎక్కువ ఉంది. దీంతో మరణాల సంఖ్యా ఎక్కువగా ఉంది. అయితే, మరణాల సంఖ్యను తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కరోనా సోకిన వారు ఇంటివద్ద అతి తేలికగా పరిశీలించుకునే రెండు విధానాలతోకరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అధిగమించవచ్చు. ఆ రెండు విధానాలు ఏమిటంటే..శ్వాసక్రియ రేటు, అదేవిధంగా రక్త-ఆక్సిజన్ సంతృప్తి. వీటిని సరైన విధానంలో పర్యవేక్షణ జరపడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ఇచ్చిన తాజా గైడ్ లైన్స్ ప్రకారం, కరోనా సోకిన వారు “శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది” అలాగే, “ఛాతీలో నిరంతర నొప్పి లేదా ఒత్తిడి” వంటి బహిరంగ లక్షణాలను అనుభవించినప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి.

చాలా మంది ఇంటిదగ్గర కరోనా కోసం చికిత్స తీసుకుంటున్నవారు శ్వాసక్రియ మరియు రక్త ఆక్సిజన్ ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకూ తెలుసుకోలేకపోతున్నారు. ఆ రెండిటినీ నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ రెండిటి విషయంలో వచ్చే తేడాను గమనించడం ద్వారా వెంటనే వైద్య సహాయం పొందగలిగితే మరణాన్ని జయించవచ్చని వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో సహ కార్డియాలజిస్ట్ నోనా సోటోడెహ్నియా చెప్పారు. కరోనాతో ఇంటి దగ్గర వైద్య సహాయం పొందుతున్నవారు శ్వాసలో వస్తున్న ఇబ్బందిని సరైన సమయానికి గుర్తించలేకపోతున్నారు. వారు గుర్తించ గలిగేంత పెద్ద లక్షణం బయట పడేసరికి సమయం మించిపోతోంది. దీంతో ఆసుపత్రులలో చేరినా, అప్పటికే ఆలస్యం కావడంతో వైద్యులు వారి ప్రాణాలను కాపాడలేకపోతున్నారని నిపుణులు అంటున్నారు.

కరోనా ప్రారంభంలో పేషెంట్స్ కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం లేదు. కానీ తక్కువ ఆక్సిజన్ సంతృప్తిని కలిగి ఉంటారు. అయినా, ఆ లక్షణాలు బయటకు కనిపించవు. దీంతో వారు అంతా మామూలుగా ఉంది అనుకుంటారు. తరువాత క్రమేపీ శ్వాసలో ఇబ్బంది తలెత్తుతుంది. దీంతో అప్పుడు ఆసుపత్రికి పరుగులు తీస్తారు. అయితే, ఈ దశ వచ్చేసరికి మేము వారిని కాపాడే అవకాశాన్ని కోల్పోతున్నాము అని చెబుతున్నారు సోటోడెహ్నియా.

సాధారణ రక్త ఆక్సిజన్‌తో ప్రవేశించిన వారితో పోలిస్తే, హైపోక్సెమిక్ రోగులు (తక్కువ రక్త-ఆక్సిజన్ సంతృప్తత; 91 శాతం లేదా అంతకంటే తక్కువ) రోగి యొక్క రక్త ఆక్సిజన్ స్థాయిలను బట్టి మరణాల ప్రమాదం 1.8 నుండి 4.0 రెట్లు ఎక్కువ. అదేవిధంగా, సాధారణ శ్వాసకోశ రేటుతో ఆసుపత్రులలో చేరిన రోగులతో పోలిస్తే, టాచీప్నియా (వేగంగా, నిస్సార శ్వాస; నిమిషానికి 23 శ్వాసలు) ఉన్నవారికి మరణాల ప్రమాదం 1.9 నుండి 3.2 రెట్లు ఎక్కువ. హైపోక్సేమియా మరియు టాచీప్నియా ఉన్న రోగులందరికీ అనుబంధ ఆక్సిజన్ అవసరం, ఇది మంటను తగ్గించే గ్లూకోకార్టికాయిడ్లతో జత చేసినప్పుడు, కరోనా తీవ్రమైన కేసులను సమర్థవంతంగా చికిత్స చేస్తుంది. సిడిసి అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసుపత్రిలో ప్రవేశం మరియు సంరక్షణకు అర్హత ఉన్న లక్షణం లేని ఈ బాధితుల కోసం వారి మార్గదర్శకాలను తిరిగి మార్చాలని మేము సిఫార్సు చేస్తున్నామంటూ పరిశోధకులు చెబుతున్నారు.

ఇంటివద్ద కరోనాకు చికిత్స పొందుతున్న వారు వారి శ్వాస క్రియ అదేవిధంగా క్త-ఆక్సిజన్ సంతృప్తి రెండిటినీ నిత్యం పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ నాలుగు సార్లు వీటిని పరిశీలించుకుంటూ దానిని రికార్డు చేయాలి. ఒకవేళ నిర్దేశించిన దానికన్నా తక్కువగా రీడింగ్ వచ్చినపుడు వెంటనే వైద్య సహాయం పొందాలి. దీనివలన కరోనా మరణాన్ని జయించే అవకాశం లభిస్తుంది.

Also Read: Corona New Study: కరోనా బాధితులకు దడ పుట్టించే వార్త… ICMR సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి

New Survey: పట్టణ ప్రజలను వణికిస్తున్న పెద్ద సమస్య అదే… తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు