Funny Viral Video: అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు.. అంతలోనే రిసార్ట్‌లోకి చొరబడిన ఎలుగుబంట్లు.. షాకింగ్ వీడియో..

Viral Video: అందరూ పార్టీ మూడ్‌లో ఉన్నారు.. రిసార్ట్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే ఊహించని అతిథులు వచ్చి వారి ప్లాన్‌ను అంతా స్మాష్ చేశాయి.

Funny Viral Video: అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు.. అంతలోనే రిసార్ట్‌లోకి చొరబడిన ఎలుగుబంట్లు.. షాకింగ్ వీడియో..
Black Bears
Follow us
Shiva Prajapati

|

Updated on: May 28, 2021 | 4:55 PM

Viral Video: అందరూ పార్టీ మూడ్‌లో ఉన్నారు.. రిసార్ట్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే ఊహించని అతిథులు వచ్చి వారి ప్లాన్‌ను అంతా స్మాష్ చేశాయి. పైగా అవి మాత్రం బాగా ఎంజాయ్ చేశాయి. ఇంతకీ వచ్చిన అతిథులు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అమెరికాలోని గాట్లిన్‌బర్గ్‌ పరిధిలో గల చాలెట్ గ్రామంలోని ఓ రిసార్ట్‌లో స్కూల్ విద్యార్థులు, టీచర్స్ వారంతపు సెలవును ఆస్వాధీస్తూ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, వారితో జత కట్టాలని భావించాయో ఏమో గానీ.. ఏడు నల్ల ఎలుగుబంట్లు వారు పార్టీ చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చాయి. దాంతో వారు హడలిపోయి రిసార్ట్ గదుల్లోకి పారిపోయారు. అయితే, రిసార్ట్‌లోకి ప్రవేశించిన ఎలుగుబంట్లు స్విమ్మింగ్ పూల్‌ను మొత్తం ఆక్రమించేసుకున్నాయి. పూల్‌లోకి దిగి సరదాగా ఈత కొట్టాయి. అన్నీ కలిసి కాసేపు సందడి చేశాయి. ఎలుగుబంట్లు చేసిన అల్లరిని కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

రిసార్ట్‌లో ఎలుగుబంట్లు చేసిన సందడిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నల్ల ఎలుగుబంట్లు చాలా అందంగా ఉన్నాయని, వాటి అల్లరి మరింత ఆకట్టుకుంటోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. మనుషులకు మాత్రమే కాదు.. మాకూ ఈత వచ్చు అని ఎలుగుబంట్లు చాటిచెప్పినట్లుగా అనిపిస్తోందని అన్నారు. కాగా, మే 26వ తేదీన షేర్ ఈ వీడియోను రెండు రోజుల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా మంది వీక్షించారు. మరెందుకు ఆలస్యం.. ఎలుగుబంట్లు చేసిన సందడిని మీరూ చూసేయండి.

Also read:

అఖిల్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై మేకర్స్ ఏమంటున్నారంటే…

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?