అటు భారతీయుడు 2 వివాదం కొనసాగుతుండగానే.. ఇటు చరణ్ సినిమా విషయంలో స్పీడ్ పెంచిన శంకర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కేక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు.

అటు భారతీయుడు 2 వివాదం కొనసాగుతుండగానే.. ఇటు చరణ్ సినిమా విషయంలో స్పీడ్ పెంచిన శంకర్
Ram Charan Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 4:22 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కేక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడని మొన్నటివరకు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ సినిమాను పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే అనూహ్యంగా భారతీయుడు 2 సినిమా వివాదంలో చిక్కుకుంది.

ఇండియన్ 2 పూర్తి చేసే వరకు మరే సినిమాను చేయను అంటూ తమతో శంకర్ అగ్రిమెంట్ లో ఉన్న కారణంగా ఎవరు కూడా ఆయనతో సినిమా చేయకూడదు అంటూ లైకా వారు హెచ్చరిస్తున్నారు. లైకా వారి వివాదం కొనసాగుతూ ఉండగానే రామ్ చరణ్ తో శంకర్ సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు మొదలవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఆల్రెడీ శంకర్ ఆ పనులను పూర్తి చేశాడట. కథాపరంగా ఆయన కొన్ని లొకేషన్స్ ను అనుకున్నాడట. కరోనా ప్రభావం తగ్గగానే వెళ్లి చూసి ఫిక్స్ చేయనున్నాడని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమా ను నిర్మించబోతున్న విషయం తెల్సిందే. సినిమా లోని ఎక్కువ సన్నివేశాలను రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు శంకర్ స్టైల్ లో పాటలకు భారీ సెట్టింగ్ లు కూడా వేయించబోతున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జూన్ జులై వరకు పూర్తి చేసి షూటింగ్ ను ప్రారంభించాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vijayendra Prasad Puri: బాహుబ‌లి ర‌చ‌యిత మొబైల్ వాల్‌పేప‌ర్‌పై ద‌ర్శ‌కుడు పూరి ఫొటో.. కార‌ణ‌మేంటో తెలుసా.?

Sushanth Singh: సుశాంత్ సింగ్ మృతి కేసులో మ‌రో వ్య‌క్తి అరెస్ట్.. సుశాంత్ చివ‌రిగా మాట్లాడింది ఈ వ్య‌క్తితోనే..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?