Sushanth Singh: సుశాంత్ సింగ్ మృతి కేసులో మ‌రో వ్య‌క్తి అరెస్ట్.. సుశాంత్ చివ‌రిగా మాట్లాడింది ఈ వ్య‌క్తితోనే..

Sushanth Singh Rajput: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హత్య వ్య‌వ‌హ‌రరం దేశ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌లనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ యంగ్ హీరో హ‌ఠాన్మ‌ర‌ణం కేసు ద‌ర్యాప్తులో...

Sushanth Singh: సుశాంత్ సింగ్ మృతి కేసులో మ‌రో వ్య‌క్తి అరెస్ట్.. సుశాంత్ చివ‌రిగా మాట్లాడింది ఈ వ్య‌క్తితోనే..
Sushant Singh Rajput
Follow us
Narender Vaitla

|

Updated on: May 28, 2021 | 3:20 PM

Sushanth Singh Rajput: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హత్య వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌లనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ యంగ్ హీరో హ‌ఠాన్మ‌ర‌ణం కేసు ద‌ర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ విచార‌ణ రోజుకో మ‌లుపు తిరుగుతూ వ‌స్తోంది. తాజాగా సుశాంత్ చ‌నిపోయి ఏడాది ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో మ‌రో అప్‌డేట్ వ‌చ్చింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయ‌న పి.ఆర్ మేనేజ‌ర్ సిద్ధార్థ్ పితానిని ఎన్‌సీబీ అధికారులు హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేశారు. మాద‌క ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ)అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌ను అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ గ‌తంలో మూడేళ్ల‌పాటు సుశాంత్‌ నివసించిన ఫ్లాట్‌లోనే ఉన్నాడు. ఇక సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు చివరిసారిగా సిద్ధార్థ్‌తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించారు. తాజాగా సిద్ధార్థ్‌ను మ‌ళ్లీ అదుపులోకి తీసుకోవ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎమోష‌నల్ పోస్ట్ చేసిన రియా..

ఇదిలా ఉంటే సుశాంత్ మ‌ర‌ణించి జూన్ 14నాటికి ఏడాది పూర్తికానున్న నేప‌థ్యంలో. ఆయ‌న ప్రేయ‌సి రియా చ‌క్రవ‌ర్తి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా రియా పోస్ట్ చేస్తూ.. ‘ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే అంత గొప్ప బలం చేకూరుతుంది. ఈ విషయంలో మీరు నన్ను నమ్మి తీరాల్సిందే.. ప్రేమతో రియా.. అంటూ రాసుకొచ్చారు. ఇక సుశాంత్ కేసులో.. డ్రగ్స్‌ కోణం వెలుగు చూడటంతో విచారణ చేపట్టిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) అధికారులు సుశాంత్‌ ప్రేయసి రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అరెస్ట్‌ చేశారు. సుమారు నెల రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత రియా బెయిల్‌ మీద బయటకు వ‌చ్చిన విష‌యం విధిత‌మే.

Also Read: Man Chews Snake: కరోనాకు విరుగుడు అంటూ పామును నిమిలిని తిన్న వ్యక్తి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Wedding turns super-spreader: పెళ్లి వేడుకలో కరోనా కలకలం.. 100మందికి పాజిటివ్, పెళ్లి కొడుకు తండ్రి తోపాటు నలుగురి మృతి

kalyan ram: మగధ రాజ్యాధిపతి బింబిసారుడిగా నందమూరి కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ మూవీ మోషన్ పోస్టర్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?