Wedding turns super-spreader: పెళ్లి వేడుకలో కరోనా కలకలం.. 100మందికి పాజిటివ్, పెళ్లి కొడుకు తండ్రి తోపాటు నలుగురి మృతి

కరోనా మహమ్మారి ఏదో ఒక రూపంలో అంటుకుంటూనే ఉంది. తాజాగా ఓ పెళ్లి కారణంగా కరోనా సూపర్ స్ప్రైడ్ గా మారింది. ఏకంగా 100మంది వైరస్ బారినపడ్డారు.

Wedding turns super-spreader: పెళ్లి వేడుకలో కరోనా కలకలం.. 100మందికి పాజిటివ్, పెళ్లి కొడుకు తండ్రి తోపాటు నలుగురి మృతి
Marriage
Follow us
Balaraju Goud

|

Updated on: May 28, 2021 | 3:01 PM

Khammam Wedding turns Covid-19 Super-Spreader: పెళ్లి అంటే నూరేళ్ల పంట అందుకే పెళ్లిని అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా..పెళ్లిల్లు అనేవి అంత్యంత అట్టహాసంగా జరుగుతాయి. స్థాయిని బట్టి డబ్బు ఖర్చు పెట్టి పెళ్లిల్లు చేస్తారు. కానీ, కరోనా కాలంలో రివర్స్ అయ్యాయి. ఉన్నదాంట్లోనే సర్దుపోవల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నా ఏం ప్రయోజనం లేని పరిస్థితులు కరోనా కాలంలో నెలకొన్నాయి. కరోనా మొదటి వేవ్‌లోనే ఇబ్బందిపడ్డ పెళ్లి వారు, సెకండ్ వేవ్ తో మాత్రం ఆ వైపు కూడ చూడని పరిస్థితి తప్పని సరైతే కొంతమంది కేవలం కుటుంబసభ్యులను మాత్రమే వెంటబెట్టుకుని పెళ్లిల్లు చేసుకుంటున్నారు.

అయినప్పటికీ కరోనా మహమ్మారి ఏదో ఒక రూపంలో అంటుకుంటూనే ఉంది. తాజాగా ఓ పెళ్లి కారణంగా కరోనా సూపర్ స్ప్రైడ్ గా మారింది. ఏకంగా 100మంది వైరస్ బారినపడ్డారు. అంతేకాదు.. వారిలో నలుగురు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కొంతమంది అతిథులు పెళ్లి నుండి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఖమ్మం జిల్లా ముత్యాలగూడెం గ్రామానికి చెందిన ఓ జంట ఈ నెల 14వ తేదీన వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి మొత్తం 250మంది హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో అతిథులు ఎవరు కూడా కోవిడ్ నిబంధనలను పాటించలేదని సమాచారం. వారిలో కొందరు కనీసం మాస్కులు కూడా ధరించలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో దాదాపు 100మంది అతిథులు కరోనా బారినపడ్డారు. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో.. పెళ్లికొడుకు తండ్రి కూడా ఉండటం గమనార్హం. అయితే, ఇక్కడ హృదవిదాకర విషయం ఘటన ఏమంటే.. చనిపోయినవారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు గానీ, గ్రామస్తులు గానీ ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. దీంతో… ఆ గ్రామం పక్కనే ఉన్న కారేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన స్థానికులు వారి అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా, వంద మంది కరోనా బారినపడటంతో జిల్లా వైద్య ఆధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన కరోనా బాధితులంతా హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. పెళ్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 100మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా.. సర్కార్ నిబంధనలు ఎవరూ పట్టించుకోకుండా.. ఎక్కువ మంది హాజరయ్యారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే.. ఇలా ఇంత మందికి కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, అంతకుముందు నిజామాబాద్ జిల్లాలోని హన్మాజిపేట గ్రామంలో ఒక వివాహ వేడుక సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌గా మారింది. ఇందులో 87 మంది అతిథులు కోవిడ్ బారినపడ్డారు. తాజాగా ఖమ్మం జిల్లాలో దాదాపు 100 మంది వైరస్ కాటుకు గురయ్యారు.

Read Also…  Corona Effect: ఆకాశాన్నంటుతున్న పప్పులు..నూనెల ధరలు.. ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటున్న ఆర్బీఐ