AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MEIL: తెలంగాణకు మేఘా చేయూత… బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న థాయిలాండ్‌ ఆక్సిజన్ ట్యాంకర్లు

MEIL: మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ థాయ్ లాండ్ నుంచి క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించింది.

MEIL: తెలంగాణకు మేఘా చేయూత... బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న థాయిలాండ్‌ ఆక్సిజన్ ట్యాంకర్లు
Megha Engineering Company
Sanjay Kasula
|

Updated on: May 28, 2021 | 3:10 PM

Share

మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ థాయ్ లాండ్ నుంచి క్రయోజెనిక్ ఆక్సీజన్ ట్యాంకర్లను తెప్పించింది. తెలంగాణ ప్రభుత్వానికి సహాయం చేస్తున్న క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు థాయిలాండ్‌ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి.

రెండవ దశలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు IAF ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్‌కు చేర్చింది. శుక్రవారం రోజు ఆక్సిజన్ మూడు(3) Cryogenic O2 ట్యాంకర్లును బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి తెలంగాణ ఆరోగ్య శాఖకు అందజేయనున్నారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు.  ఒక్కో‌ట్యాంకర్ ద్వారా కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పతి అవుతుంది.

ప్రతి క్రయోజెనిక్ ట్యాంకర్‌లో 1.40  కోట్ల లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. పెద్ద సంఖ్యలో ట్యాంకర్లను దిగుమతి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. మేఘా ఇంజనీరింగ్ కార్పొరేషన్ (MEIL) తన సామాజిక సేవా బాధ్యతలో భాగంగా థాయిలాండ్ నుండి భారతదేశానికి ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించింది.

వీటిని ప్రభుత్వానికి ఉచితంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇవ్వనుంది. వీటి ద్వారా తెలంగాణలో ఆక్సిజన్ కష్టాలను తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఒక్కొక్కటి 7వేల లీటర్లు గల ఆక్సిజన్‌ సిలిండర్లను ప్రతి రోజు కనీసం పది ఆస్పత్రులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 4,242 సిలిండర్లను వివిధ ఆస్పత్రులకు సరఫరా చేశారు. ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను అందించేందుకు మేఘా ఇంజనీరింగ్ కార్పొరేషన్ (MEIL) ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి : Corona New Study: కరోనా బాధితులకు దడ పుట్టించే వార్త… ICMR సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి

Good News: ఫైజర్ వ్యాక్సిన్ భారతదేశంలో వినియోగానికి అనుమతి ఇచ్చే దిశలో ప్రభుత్వం..జూలై నుంచి అందుబాటులోకి?