Man Chews Snake: కరోనాకు విరుగుడు అంటూ పామును నమిలిని తిన్న వ్యక్తి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Corona Effect: తమిళనాడులోని మధురై జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. కోవిడ్ 19 వైరస్‌కు విరుగుడు అంటూ చనిపోయిన...
Man Chews Snake: తమిళనాడులోని మధురై జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. కోవిడ్ 19 వైరస్‌కు విరుగుడు అంటూ చనిపోయిన పామును నమిలి తిన్నాడు ఓ వ్యక్తి. పైగా.. పామును తింటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పామును తింటే కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించందని సదరు వ్యక్తి ఆ వీడియోలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వీడియో కాస్తా ఫారెస్ట్ అధికారుల కంట పడటంతో.. అధికారులు అతన్ని అరెస్ట్ చేసి, రూ. 7 వేల జరిమానా విధించారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని మధురై జిల్లా పెరుమపట్టి ప్రాంతానికి చెందిన వ్యవసాయ కార్మికుడు వడివేలు(50) కరోనాకు విరుగు అంటూ పాములను తినడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తాజాగా ఒక పామును అలాగే నమిలి తినేశాడు. పామును తినే సమయంలో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పామును తింటే కరోనా వైరస్ సోకదని, అందుకని అందరూ పాములను తినాటని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఈ వీడియో కాస్తా జిల్లా అటవీ అధికారుల కంట పడటంతో ఈ ఘటనను వారు సీరియస్‌గా తీసుకున్నారు. పామును తిన్న వ్యక్తి పట్టుకోవాలని జిల్లా అటవీ అధికారి ఎస్ ఆనంద్.. అధికారులను ఆదేశించారు. దాంతో వారు వడివేలును అదుపులోకి తీసుకున్నారు. అతనికి రూ. 7 వేల జరిమానా కూడా విధించారు. కాగా, పామును తిన్న సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు వడివేలు అంగీకరించాడు. అంతేకాదు.. కరోనాను ఎదుర్కోవాలంటే పాములను తినాలని కొందరు తనను బలంతం చేశారని వడివేలు అధికారులకు చెప్పాడు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. విషపూరిత పామును తిన్నప్పటికీ వడివేలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇది అతని అదృష్టంగా పేర్కొంటున్నారు అధికారులు. ఏదేమైనా.. పాములను తినడం ద్వారా కరోనా కట్టడి కాదని, ఇలా మరెవరూ పిచ్చి పనులు చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ జంతువులకు హానీ తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also read:
kalyan ram: మగధ .రాజ్యాధిపతి బింబిసారుడిగా నందమూరి కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ మూవీ మోషన్ పోస్టర్..