AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kalyan ram: మగధ రాజ్యాధిపతి బింబిసారుడిగా నందమూరి కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ మూవీ మోషన్ పోస్టర్..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

kalyan ram: మగధ రాజ్యాధిపతి బింబిసారుడిగా నందమూరి కళ్యాణ్ రామ్.. 'బింబిసార' మూవీ మోషన్ పోస్టర్..
Rajeev Rayala
|

Updated on: May 28, 2021 | 2:54 PM

Share

kalyan ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటాడు కళ్యాణ్ రామ్. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆ రేంజ్ హిట్ ను అందుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.  ‘బింబిసార’ అనే హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కళ్యాణ్ రామ్.  ఈ సందర్భంగా ”బింబిసార” టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ ‘కింగ్’ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. యుద్ధంలో తన చేతిలో చనిపోయినవారి శవాల గుట్టపై కూర్చొని వైలెంటుగా చూస్తున్నాడు.

క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లింకును పంచుకుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా ఇతరభాషల్లోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nag Ashwin-Prabhas : టైమ్ మిషన్ నేపథ్యంలో ప్రభాస్ సినిమా.. భారీ ప్లాన్ వేస్తున్న నాగ్ అశ్విన్..

Balakrishna Rama Dandakam : బాలయ్య కంఠం నుంచి ఉప్పొంగిన శ్రీరామ దండకం.. తండ్రి జన్మదినవేళ ఘనంగా గాత్ర నివాళి.. ఎలా ఉందో మీరూ చూడండి..!

Balaiah on Anandayya : ఆనందయ్య కరోనా మందుపై టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కామెంట్స్

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి