Balakrishna Rama Dandakam : బాలయ్య కంఠం నుంచి ఉప్పొంగిన శ్రీరామ దండకం.. తండ్రి జన్మదినవేళ ఘనంగా గాత్ర నివాళి.. ఎలా ఉందో మీరూ చూడండి..!
తన తండ్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావుకు బాలకృష్ణ గాత్ర నివాళులర్పించారు...

Balakrishna
Sri Rama Dandakam by Nandamuri Balakrishna : తన తండ్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావుకు బాలకృష్ణ గాత్ర నివాళులర్పించారు. ఈ రోజు ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా దివంగత ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ బాలకృష్ణ శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ ఈ వీడియోని తమ ట్విట్టర్‌లో విడుదల చేయగా, ఆయన అభిమానులనే కాదు, మరెందరినో ఔరా..! అనిపిస్తోంది ఆయన గాత్ర నీరాజనం. ఆ బాలయ్య స్వర శ్రీరామ దండకం వీడియో మీరూ చూడండి..
Read also : Balaiah on Anandayya : ఆనందయ్య కరోనా మందుపై టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కామెంట్స్



