AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా…? ఇదిగో క్లారిటీ

క‌రోనా వ్యాప్తి స‌మ‌యంలో వేరియంట్ల గురించి, చికిత్స గురించి, వ్యాక్సిన్స్ గురించి ర‌క‌ర‌కాల ఫేక్ న్యూస్‌లు సోష‌ల్ మీడియాలో స‌ర్కులేట్ అవుతున్నాయి. వీటిలో నిజం ఏదో.. ఫేక్ ఏదో అర్థం కాక...

Fact Check: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా...? ఇదిగో క్లారిటీ
Black Layer On Onion
Ram Naramaneni
|

Updated on: May 28, 2021 | 5:51 PM

Share

క‌రోనా వ్యాప్తి స‌మ‌యంలో వేరియంట్ల గురించి, చికిత్స గురించి, వ్యాక్సిన్స్ గురించి ర‌క‌ర‌కాల ఫేక్ న్యూస్‌లు సోష‌ల్ మీడియాలో స‌ర్కులేట్ అవుతున్నాయి. వీటిలో నిజం ఏదో.. ఫేక్ ఏదో అర్థం కాక జ‌నాలు క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. తాజాగా క‌రోనా విజేత‌ల‌ను ఫంగ‌స్ టెన్ష‌న్ వెంటాడుతున్న విష‌యం తెలిసిందే. తొలుత బ్లాక్… ఆ త‌ర్వాత వైట్.. తాజాగా ఎల్లో ఫంగ‌స్ గురించి.. అవి చేస్తోన్న డ్యామేజ్ గురించి మ‌నం వార్త‌లు వింటున్నాం. అయితే ఇమ్యూనిటి ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉండ‌టం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వ‌ల్ల ఈ ఫంగ‌స్‌ల ప్ర‌మాదం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినా కానీ.. పలు వార్తలు బాధితులను ఆందోళనలో పడేస్తున్నాయి.

నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్​ఫంగస్​ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్య‌మాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. దీంతో పాటు ఫ్రిజ్​లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్​ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్​లు స‌ర్కులేట్ అవుతున్నాయి. ఈ వార్తలపై స్పందించి ఎయిమ్స్​ చీఫ్​ రణ్​దీప్​ గులేరియా.. ఓ స్పష్టతనిచ్చారు. ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్​ఫంగస్​ వస్తుందన్న వార్తలు పూర్తిగా అసత్యం అని కొట్టిపారేశారు. రిఫ్రిజిరేటర్‌లో నల్లగా పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా బ్లాక్​ ఫంగస్​కు కారణమవుతుందనేది అవాస్తమ‌ని చెప్పారు. ప్రజలు ఇటువంటి ఫేక్​న్యూస్ నమ్మి భయపడొద్దని సూచించారు. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్ ​ఫంగస్​ రాదని వెల్ల‌డించారు. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్​ వల్ల వస్తుందని… దాన్ని శుభ్రం చేసుకుని వాడుకుంటే ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు.

Also Read:  ఏపీలో మ‌రో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు !

ఏపీలో టెన్త్ పరీక్ష‌లు క‌చ్చితంగా నిర్వ‌హిస్తాం… వ‌దంతుల‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి క్లారిటీ