Ap Ssc Exams 2021: ఏపీలో టెన్త్ పరీక్ష‌లు క‌చ్చితంగా నిర్వ‌హిస్తాం… వ‌దంతుల‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి క్లారిటీ

ఏపీలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను క‌చ్చితంగా నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేశారు. త్వ‌రంలోనే ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు. పరీక్షలు ర‌ద్ద‌వుతాయంటూ...

Ap Ssc Exams 2021: ఏపీలో టెన్త్ పరీక్ష‌లు క‌చ్చితంగా నిర్వ‌హిస్తాం... వ‌దంతుల‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి క్లారిటీ
AP Education Minister adimulapu suresh on 10th exams
Follow us
Ram Naramaneni

|

Updated on: May 28, 2021 | 5:07 PM

ఏపీలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను క‌చ్చితంగా నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేశారు. త్వ‌రంలోనే ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు. పరీక్షలు ర‌ద్ద‌వుతాయంటూ ప్ర‌వేట్ కాలేజీలు చేస్తున్న ప్ర‌చారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంట‌ర్ అడ్మిష‌న్లు తీసుకుంటున్న కాలేజీలపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. కొన్ని కాలేజీలు ఇంట‌ర్ అడ్మిష‌న్లు తీసుకుంటూ… ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయ‌న్న సమాచారంపై మంత్రి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇటువంటి ప‌ద్ద‌తి మంచిది కాద‌ని సూచించారు. కాగా ఏపీలో టెన్త్‌ పరీక్షలు మ‌రోసారి వాయిదా పడిన విష‌యం తెలిసిందే. టెన్త్‌ పరీక్షలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. టీచర్లకు వ్యాక్సిన్‌ పూర్తయ్యాకే ఎగ్జామ్స్ నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. టెన్త్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ స‌ర్కార్ హైకోర్టుకు తెలిపింది. లిఖిత పూర్వకంగా తెలపాలని గ‌వ‌ర్న‌మెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్‌ 18కి హైకోర్టు వాయిదా వేసింది.  జులైలో మరోసారి సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే.. ప్రస్తుతానికి స్కూల్స్ తెరిచే ఉద్దేశం లేదని ఏపీ స‌ర్కార్ వెల్ల‌డించింది.

ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఇంతవరకు స్ప‌ష్టత ఇవ్వ‌లేదు. ఇదిలా ఉంటే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు కష్టమని ఇటీవల విద్యాశాఖ ప్రభుత్వానికి లేఖరాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. జూలై నెలలో కరోనా సెకండ్ వేవ్, పాజిటివ్ కేసుల తగ్గితే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Also Read:  ఏపీలో మ‌రో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు !

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ