Lock Down: లాక్‌డౌన్ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్న హైదరాబాదీలు.. ఇప్పటి వరకు నమోదైన కేసులు..
Lock Down Hyderabad: భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా సెకండ్ వేవ్‌కు అడ్డుకట్ట వేయడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాదిలా కాకుండా ఈసారి...
Lock Down Hyderabad: భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా సెకండ్ వేవ్‌కు అడ్డుకట్ట వేయడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాదిలా కాకుండా ఈసారి ఆంక్షలకు కాస్త సడలింపులు ఇస్తున్నారు. అత్యవసర అవసరాల కోసం రోజులో కొంత సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజల సౌకర్యార్థం ఉదయం 6.00 గంటల నుంచి 10.00 గంటల వరకు లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేకాతరు చేస్తూ కొందరు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఏకంగా 9,552 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. వీటిలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 8016 మందిపై కేసు నమోదు చేశారు. ఇక ఈసారి మాస్కు ధరించడంపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలో మాస్కు ధరించకుండా బయట తిరిగిన 1088 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక సోషల్ డిస్టెన్స్ పాటించని 367 మందిపై కేసు నమోదు చేశారు. కరోనా ఆంక్షలున్నా కొందరు పుట్టిన రోజులు, ఫంక్షన్ల పేరిట భారీ ఎత్తున జనాలు గుమిగూడిన సంఘటనల చోటుచేసుకున్నాయి ఇలాంటి వాటిపై మొత్తం 55 కేసులు నమోదయ్యాయి. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పొగాకు సంబంధిత ఉత్పత్తులను సేవించిన 26 మందిపై కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి ఎక్కిన 6514 వాహనాలు సీజ్ చేశారు.
Also Read: MLC Elections Postponed: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
Pawan Kalyan: జక్కన్న రికార్డులు చెరిపేసే దమ్ము అతడికే ఉందా..? అతడో నిశ్శబ్ధ యుద్దమా..?
Earth: భూమిలోపలకు ఎంత లోతువరకూ బిలం తవ్వగలమో తెలుసా? ఇంతవరకూ ఈలోతు దాటి ఎవరూ పోలేదు!